- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూఇయర్ వేడుకల ఎఫెక్ట్: అప్రమత్తమైన పోలీస్ శాఖ
న్యూఇయర్ వేడుకల ఎఫెక్ట్: అప్రమత్తమైన పోలీస్ శాఖ

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబరు 31 వ తేదీన బార్లకు, క్లబ్‌లకు, ఈవెంట్ పర్మిషన్ తీసుకున్న వాళ్లకు, టూరిజం ప్రాంతాల్లో రాత్రి 1 గంటల వరకు మద్యం సేవించడానికి అనుమతి ఉంటుందన్నారు. ఏ 4 షాపులు (మద్యం షాపులకు) రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చునని పేర్కొన్నారు. కొత్త ఏడాది వేడుకలకు మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వడంతో పాటు ఈ నెల 30, 31న ప్రత్యేక తనిఖీలుంటాయన్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ వెల్లడించింది. ఇప్పటికే చాలా చోట్ల యువతను పాత ఏడాదికి వీడ్కోలు , నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఈవెంట్లు సిద్దమైయాయి. నగర శివారు ప్రాంతంలో పెద్దమొత్తంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. ఈఏడాది కోట్ల రూపాయల దందా సాగుతుందని అబ్కారీ శాఖ అంచనా వేస్తుంది. ఇష్టానుసారంగా మద్యం అమ్మకాలు చేయకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా తగిన ఏర్పాటు చేస్తోంది. ఎక్కడ గొడవలు జరగకుండా పోలీసుల శాఖ అప్రమత్తమైంది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. రోడ్లపై ద్విచక్ర వాహనాలతో హంగామా చేస్తే కేసు నమోదు తప్పదని పేర్కొంది.






