- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుస సెలవుల ఎఫెక్ట్.. హైదరాబాద్–విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్
వరుస క్రిస్మస్ (Christmas) సెలవులు, వీకెండ్ (Weekend) నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: వరుస క్రిస్మస్ (Christmas) సెలవులు, వీకెండ్ (Weekend) నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. క్రిస్మస్ తర్వాత ఆఫీసులు, కాలేజీలు, పాఠశాలలు తెరవడంతో ఒకేసారి సిటీ వైపు లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా పంతంగి, చౌటుప్పల్, కోర్లపాడు టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర జామ్‌లు ఏర్పడ్డాయి. నేషనల్ హైవే 65పై ఔటర్ రింగ్ రోడ్ (ORR) నుంచి అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, చౌటుప్పల్ ప్రాంతాల్లో బంపర్-టు-బంపర్ ట్రాఫిక్‌తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇక 6 లేన్ల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా చౌటుప్పల్, చిట్యాల, నార్కెట్‌పల్లి, పంతంగి వంటి చోట్ల బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ల నిర్మాణాల వల్ల రోడ్డు సామర్థ్యం తగ్గి ట్రాఫిక్ మరింత ఆలస్యమవుతోంది. ఈ పనులు పూర్తయ్యే వరకు ఇలాంటి ఇబ్బందులు కొనసాగే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ రూట్ల ద్వారా వాహనాలను మళ్లీస్తున్నారు. అంబులెన్స్‌లు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నేషనల్ హైవేపై ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ రూట్లలో తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని, నిరంతరం ట్రాఫిక్ అప్‌డేట్‌లను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవాలని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ వాహనాల రద్దీ మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని వారు తెలిపారు.






