TG: వీడిన ఉత్కంఠ.. రాష్ట్రంలో రేపటి నుంచి విద్యాసంస్థలు ఓపెన్

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-07 14:30:59  IST  )

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)తో ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.

TG: వీడిన ఉత్కంఠ.. రాష్ట్రంలో రేపటి నుంచి విద్యాసంస్థలు ఓపెన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)తో ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. చాలాసేపు హైడ్రామా తర్వాత చర్చలు ఫలించాయి. దీంతో రేపటి(శనివారం) నుంచి తెలంగాణలో యథావిధిగా విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఇదిలా ఉంటే.. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ హయాంలో రీయింబర్స్‌మెంట్(Fee Reimbursement) స్కీమ్ ప్రారంభమైంది. ఆ తరువాత సీఎంగా పనిచేసిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ ఈ స్కీమ్‌ను కొనసాగించారు. ఎప్పటి బిల్లులు అప్పుడే రిలీజ్ చేసేవారు. అయితే రాష్ట్ర ఏర్పాటు తరువాత కేసీఆర్ సైతం స్కీమ్‌ను కొనసాగించారు. కానీ బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం జరిగినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాలేజీల మేనేజ్‌మెంట్స్ నోరు విప్పకుండా మౌనంగా భరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత యాజమన్యాలు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించి, చివరికి కాలేజీల బంద్ కొనసాగిస్తున్నాయి. తాజాగా ఇవాళ కాలేజీ యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి చర్చించి ఒప్పించారు. మొత్తం రూ.900 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించారు. వచ్చే మూడు రోజుల్లో రూ.600 కోట్లు విడుదల చేస్తామని వారికి హామీ ఇచ్చారు. దీంతో విద్యాసంస్థల యాజమన్యాలు శాంతించాయి.

Next Story