- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో విద్యా వ్యవస్థ అభివృద్ధి.. తగ్గిన డ్రాప్ అవుట్స్
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వినూత్న ప్రోగ్రామ్స్‌తో స్టేట్‌లో విద్యా వ్యవస్థ బలోపేతం అవుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వినూత్న ప్రోగ్రామ్స్‌తో స్టేట్‌లో విద్యా వ్యవస్థ బలోపేతం అవుతున్నది. ఇప్పటికే గురుకులాల్లో కామన్ డైట్ మెనూ, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, ప్రయివేటు స్కూళ్లకు ప్రభుత్వ సహకారం, డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీ వంటి చర్యలు స్టూడెంట్స్‌కు నాణ్యమైన విద్య అందించేందుకు దోహద పడుతూ.. విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందుకు తీసుకెళ్తున్నాయి.
తగ్గిన డ్రాప్ అవుట్స్
రాష్ట్రంలో 2023-24లో మొత్తం 40,975 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 20,539 ప్రాథమిక, 7,482 మాధ్యమిక, 11,561 ఉన్నత, 1,393 ఉన్నత మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ విడుదల చేసిన అట్లాస్ (తెలంగాణ స్టేట్ స్టాటటికల్ అబ్ స్ట్రాక్ట్ ) రిపోర్టు ప్రకారం ప్రాథమిక విద్యలో డ్రాప్ అవుట్ల సంఖ్య తగ్గతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక స్థాయి తరగతులకు డ్రాప్ అవుట్ రేటు -2.23%, అప్పర్ ప్రైమరీ 0.34%, ఉన్నత పాఠశాలల్లో 11.95 శాతంగా ఉన్నది. వీటిలో ప్రాథమిక స్థూల నమోదు నిష్పత్తి 100 శాతం పెరిగింది. ఇక ప్రాథమిక స్థాయిలో 110 శాతం, అప్పర్ ప్రైమరీకి 107 శాతం పెరిగింది. అయితే ఉన్నత స్థాయిలో మాత్రం 5 శాతం తగ్గి 95 శాతం నిష్పత్తి నమోదైంది.
జిల్లాల వారిగా చూస్తే..
జయశంకర్ జిల్లాలో అత్యధికంగా డ్రాప్ అవుట్ రేట్స్ ప్రాథమిక, మధ్య స్థాయిలో 6.07 శాతం, అప్పర్ ప్రైమరీలో 7.39 శాతంగా ఉన్నది. ఉన్నత స్థాయిలో అత్యధికంగా కుమురం భీమ్ 29.82%,, జోగులంబ గద్వాల 28.83%, మహబూబాబాద్‌లో 28.35%గా ఉన్నది. ఉన్నత స్థాయిలో మేడ్చల్ మల్కాజిగిరిలో -14.57%, -6.06%, హనుమకొండలో -17.60% శాతంగా ఉంది. రాష్ట్రం మొత్తం తీసుకున్నప్పుడు ప్రాథమిక స్థాయిలో ప్రభుత్వ, ప్రయివేట్ విద్యా సంస్థల్లో మాత్రం డ్రాప్ అవుట్స్ సంఖ్య మాత్రం గణణీయంగా తగ్గింది.
విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిలో కీలక మార్పులు
విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ వస్తోంది. ఫలితంగా ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి సగటులో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఆర్టీఈ 2009 ప్రకారం ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి గ్రేడ్ 1 నుంచి 5 తరగతి వరకు 30:1 ఉండాలి. 6 నుంచి 8 తరగతులకు 35:1 ఉండాలని స్పష్టం చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో 9వ తరగతి నుంచి 10 వరకు 22 లేదా 26గా ఉండాలి. కాగా రాష్ట్రంలో 22 జిల్లాల్లో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి సమానంగా ఉంది. ఇది ప్రాథమిక పాఠశాలల్లో సగటు స్థాయిని దాటింది. 23 జిల్లాల్లోని ఉన్నత పాఠశాలల్లో సగటు తక్కువగా ఉంది. మరో 13 జిల్లాలోని మాధ్యమిక పాఠశాలల్లో మాత్రం సగటు నిష్పత్తి సమానంగా ఉంది. అన్ని స్థాయిల్లోనూ చూసినప్పుడు 19 శాతంగా నమోదైంది.






