టెట్ సిలబస్‌పై విద్యాశాఖ కసరత్తు.. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌తో రివ్యూ కమిటీ

by Kema Shiva Kumar |

ఉపాధ్యాయ అర్హత పరీక్ష సిలబస్‌లో మార్పులు తీసుకురావడానికి పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

టెట్ సిలబస్‌పై విద్యాశాఖ కసరత్తు.. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌తో రివ్యూ కమిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉపాధ్యాయ అర్హత పరీక్ష సిలబస్‌లో మార్పులు తీసుకురావడానికి పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. సిలబస్‌ను టెట్ సిలబస్‌పై లోతైన పరిశీలన జరిపేందుకు, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌తో కూడిన ప్రత్యేక సిలబస్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఈ కమిటీ ప్రస్తుత సిలబస్‌ను సమీక్షించి, అవసరమైన మార్పులు, చేర్పులను ప్రతిపాదించనుంది. టెట్‌లో సిలబస్ ఎలా ఉంది, సిలబస్‌లో ఏ మార్పులు చేస్తే బాగుంటుంది అనే అంశాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిలబస్‌తో ఇన్‌సర్వీస్ టీచర్లకు పరీక్షలు నిర్వహిస్తే ఆ టీచర్లు టెట్‌లో ఉత్తీర్ణులు కావడం సాధ్యంకాదనే వాదన వినిపిస్తోంది. ఒక్కో టీచర్ తమ సర్వీస్‌లో దాదాపు 20 ఏండ్ల నుంచి ఒకే సబ్జెక్టులో బోధిస్తున్నారు. కాబట్టి వారి సబ్జెక్టుకు సంబంధం లేని సిలబస్ టెట్‌లో ఎక్కువగా ఉండడంతో టీచర్లంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే సబ్జెక్టుల ఆధారంగా టెట్ పరీక్షలు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను సంప్రదించినట్లు సమాచారం.

టీచర్ల అభ్యంతరాలు, ప్రతిపాదనలు

ప్రస్తుతం అమలులో ఉన్న టెట్ సిలబస్‌పై తాము బోధించే పాఠ్యాంశాలకు తక్కువ మార్కులు ఉన్నాయని, ఇతర సబ్జెక్టుల సిలబస్ చదవడం కష్టతరంగా ఉందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, పరీక్ష విధానంలో మార్పులు తీసుకురావాలని టీచర్లు ప్రతిపాదిస్తున్నారు. కేవలం ఉమ్మడి పరీక్ష కాకుండా, అభ్యర్థులు బోధించబోయే సబ్జెక్టు ఆధారంగా టెట్ పరీక్ష నిర్వహించాలనే డిమాండ్‌పై విద్యాశాఖ సమాలోచనలు జరుపుతోంది. సెకండరీ స్కూల్ టీచర్లు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా పనిచేస్తున్న టీచర్లు టెట్ పేపర్ 1 రాయాలి. వీరికి ప్రాథమిక పాఠశాల స్థాయి బోధనాంశాలే సిలబస్‌లో ఇస్తారు. బీఈడీ పూర్తిచేసి ఎస్జీటీలుగా పనిచేసే వారికి టెట్ రాసే అవకాశం ఉంది. స్కూల్ అసిస్టెంటు, జీహెచ్ఎంలుగా పనిచేస్తున్న వారు పేపర్ 2 రాయాల్సి ఉంది. సైన్స్, మ్యాథ్స్, మ్యాథ్స్ టీచర్లకు సైన్స్ సిలబస్ ఉంటుంది. మిగతా వాళ్లంతా వారి సబ్జెక్టులకు అనుగుణంగానే పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందరితో కాకుండా తమకు డిపార్ట్మెంటల్ పరీక్షల తరహా నిర్వహించే ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు.

టెట్ అభ్యర్థులకు ఉచిత డైలీ ప్రాక్టీస్ టెస్ట్‌లు

తెలంగాణాలో టెట్-2026 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మెరుపు యాప్ ఉచితంగా ప్రాక్టీస్ టెస్టులను అందిస్తోంది. టెట్ నోటిఫికేషన్ ఇటీవలే రాగా జనవరి ఫస్ట్ వీక్‌లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈసారి డీఎడ్, బీఎడ్ పూర్తి అయిన విద్యార్థులతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు కూడా ఈ ఎగ్జామ్‌లో అర్హత సాధించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వీరందరి ప్రిపరేషన్‌కు వీలుగా మెరుపు యాప్ నేటి నుంచి డిసెంబర్ 21 వరకు నెల రోజుల పాటు డెయిలీ ప్రాక్టీస్ టెస్ట్‌లను అందిస్తోంది. అభ్యర్థులు ఎప్పుడు, ఎక్కడి నుంచైనా ఎలాంటి రిజిస్ట్రేషన్, ఎంట్రీ ఫీజులు లేకుండానే ఉచితంగా ప్రాక్టీస్ టెస్ట్‌లు అటెండ్ చేయొచ్చు. అభ్యర్థులు తమ సెల్ ఫోన్లలో మెరుపు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

Next Story