Breaking: రేపు విద్యాసంస్థలకు సెలవు

by Vemula.Srinu Prasad |

కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు...

Breaking: రేపు విద్యాసంస్థలకు సెలవు
X

దిశ, వెబ్ డెస్క్: కామారెడ్డి జిల్లా(Kamareddy District)లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు(Education Department) కీలక నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో గురువారం విద్యాసంస్థల(Schools)కు సెలవు ప్రకటించారు. వర్షాల నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. భారీ వర్షాలు కొనసాగితే తదుపరి నిర్ణయాన్ని సైతం ప్రకటిస్తామని చెప్పారు.

కాగా కామారెడ్డి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు(Heavy Reins) కురుస్తున్నారు. ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. రికార్డు స్థాయిలో కామారెడ్డిలో 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఉదయం నుంచి పడి వర్షంతో జిల్లాలో పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్డుపై వాగు ప్రవాహం కొనసాగుతోంది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరింది. పలు కాలనీలు సైతం నీటమునిగాయి. కామారెడ్డి-నిజామాబాద్ మధ్య ఓచోట రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. మరో చోట ట్రాక్‌పైకి వర్షపు చేరింది. దీంతో పలు రైళ్లు రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను మళ్లించారు. పొలాలు సైతం నీట మునిగిపోవడంతో రైతులు లబో దిబో అంటున్నారు. వర్షం, వరద కారణంగా పలుచోట్ల జనజీవనం కూడా స్తంభించిపోయింది.

Next Story