స్టూడెంట్స్, పేరెంట్స్ డేటా అమ్మితే ఊరుకోం.. ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ సీరియస్ వార్నింగ్!

by Ramesh Naini |

ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు విద్యార్థుల, వారి తల్లిదండ్రుల వ్యక్తిగత సమాచారాన్ని (డేటా) విక్రయించడంపై పాఠశాల విద్యాశాఖ తీవ్రంగా స్పందించింది.

స్టూడెంట్స్, పేరెంట్స్ డేటా అమ్మితే ఊరుకోం.. ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ సీరియస్ వార్నింగ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు విద్యార్థుల, వారి తల్లిదండ్రుల వ్యక్తిగత సమాచారాన్ని (డేటా) విక్రయించడంపై పాఠశాల విద్యాశాఖ తీవ్రంగా స్పందించింది. విద్యార్థుల పేర్లు, మొబైల్ నంబర్లు, చిరునామాలు వంటి అత్యంత రహస్యమైన, సున్నితమైన సమాచారాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ బయటి వ్యక్తులకు లేదా ప్రైవేటు సంస్థలకు చేరవేయకూడదని విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలోని ఆర్జేడీలు, డీఈఓలు, ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల మొబైల్ నంబర్లు, ఇతర వ్యక్తిగత వివరాలను అత్యంత రహస్యంగా ఉంచాలని తెలిపారు. ఈ డేటాను కేవలం ప్రభుత్వ నిబంధనల ప్రకారం, అధికారిక విద్యా సంబంధిత అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి అనధికారికంగా సమాచారాన్ని పంచుకున్నా, దుర్వినియోగానికి పాల్పడినా సంబంధిత వ్యక్తులు, యాజమాన్యాలపై తక్షణమే కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Next Story