- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో ఈడీ సంచలనం..రూ. 35.05 కోట్ల ఆస్తులు జప్తు!
నకిలీ పత్రాలతో బ్యాంక్ రుణాలు పొంది మోసాలకు పాల్పడిన బీఎన్ఆర్ ఇన్ఫ్రా, ఎలైట్ ఇన్ఫ్రా సంస్థలను ఈడీ జప్తు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: నకిలీ పత్రాలతో బ్యాంక్ రుణాలు పోంది మోసాలకు పాల్పడిన బీఎన్ఆర్ ఇన్ఫ్రా, ఎలైట్ ఇన్ఫ్రా సంస్థలకు ఈడీ (Enforcement Directorate) షాకిచ్చింది. ఆ సంస్థలకు చెందిన ఆస్తులను హైదరాబాద్ జోనల్ కార్యాలయం ఈడీ అధికారులు జప్తు చేశారు. రెండు సంస్థలు 35.05కోట్ల మోసాలకు పాల్పడ్డట్టు ఈడీ అధికారులు శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. జప్తు చేసిన ఆస్తులు బీఎన్ఆర్ ఇన్ఫ్రా నిర్వహకులు బీరెడ్డి నరసింహారెడ్డి, కంఫార్ట్ సెక్యూరిటీ లిమిటెడ్ డైరక్టర్ అనిల్ బెనిప్రసాద్ అగర్వాల్‌లకు చెందినట్లుగా తెలిపారు.
నకిలీ ఒప్పందాలతో మోసం:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సుమారు రూ.8.20 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు రూ.26.86 కోట్లు నష్టం వాటిల్లిందని, మనీ లాండరింగ్ (PMLA ACT) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఈడి అధికారులు వెల్లడించారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా చూపెట్టడం, వివాదాస్పద భూములను బ్యాంక్ గ్యారెంటిలుగా సమర్పించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఎస్‍బీఐ నుంచి రూ.1 కోటి విలువైన 'బ్యాంక్ గ్యారెంటీ'ని పొందే ఉద్దేశంతో, నిందితులకు కంఫర్ట్ సెక్యూరిటి లిమిటెడ్ ( డైరెక్టర్ అనిల్ బెనిప్రసాద్ అగర్వాల్)కు మధ్య నకిలీ ఒప్పందం సృష్టించి మోసాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. మోసపూరితంగా పొందిన రుణాలను దారి మళ్ళించి ఇతర ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.






