ఈడీ దాడులలో రూ.75లక్షలు స్వాధీనం

by Ajay Maddhiboyina |

హైదరాబాద్ నగరంలో ఈడీ చేపట్టిన దాడులలో నరేంద్ర సురానా, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలలో లెక్కల్లో లేని రూ.75లక్షల

ఈడీ దాడులలో రూ.75లక్షలు స్వాధీనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలో ఈడీ చేపట్టిన దాడులలో నరేంద్ర సురానా, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలలో లెక్కల్లో లేని రూ.75లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ జోనల్ ఆఫీసు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) అధికారులు వెల్లడించారు. రూ.100కోట్ల విలువైన లెక్కల్లో లేని నగదు లావాదేవీలకు చెందిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని 4 ప్రాంగణాల్లో ఈ నెల 16,17తేదీలలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ), 2002 నిబంధనల కింద సోదాలు నిర్వహించినట్లు వెల్లడించారు.

భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్ డైరెక్టర్ నరేదేరా సురానా, సాయి సూర్య డెవలపర్స్ యజమాని కె. సతీష్ చంద్ర గుప్తా ఇతరులపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన అనేక ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ప్లాట్‌ల అమ్మకాల పేరుతో పెట్టుబడిదారులను మోసం చేసి చేసినందుకు 1860 ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. అనధికారిక ల్యాండ్ లేఅవుట్‌లు, ఒకే ప్లాట్‌లను వేర్వేరు కస్టమర్లకు విక్రయించడం, సరైన ఒప్పందాలు లేకుండా చెల్లింపులు అంగీకరించడం, ప్లాట్ రిజిస్ట్రేషన్ల కోసం తప్పుడు హామీలు ఇవ్వడం వంటి మోసపూరిత పథకాలను రూపొందించారని ఈడి దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. అనేక మంది పెట్టుబడిదారులకు ఆర్థిక నష్టాన్ని కలిగించారని చెప్పాారు.

Next Story