- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సృష్టి ఫెర్టిలిటీ సరోగసి కేసు.. తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు
తాజాగా సృష్టి ఫెర్టిలిటీ సరోగసీ కేసులో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. కేసు దర్యాప్తులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో సోదాలు చేపట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో సరోగసీ (Srishti Fertitlity Surrogacy Case) పేరుతో జరుగుతున్న మోసాలు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో ఈడీ అధికారులు రెండు రాష్ట్రాల్లోనూ సోదాలు చేపట్టారు. కేసు దర్యాప్తులో విశాఖకు చెందిన వైద్యులపాత్ర కూడా ఉన్నట్లు తేలిన తరుణంలో.. ఏపీలోనూ సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో ఉన్న ఫెర్టిలిటీ సెంటర్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరోగసీ చట్టాల ఉల్లంఘన, సరోగసీ కోసం జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈకేసులో ఇప్పటికే డాక్టర్ నమ్రత సహా పలువురు అరెస్టైన విషయం తెలిసిందే. దీనిపై సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా.. తాజాగా ఈడీ రంగంలోకి దిగింది. సరోగసీ మాటున జరుగుతున్న మోసాల్లో ఎవరెవరున్నారో బయటకులాగే దిశగా ఈడీ ఫోకస్ పెట్టింది.






