కవితకు ఈడీ నోటీసులు.. కిషన్ రెడ్డి రియాక్షన్ ఇదే!

by Disha Web Desk 4 |
కవితకు ఈడీ నోటీసులు.. కిషన్ రెడ్డి రియాక్షన్ ఇదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అవినీతి కుంభకోణానికి తెలంగాణ సమాజానికి ముడిపెట్టి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై బుధవారం కిషన్ రెడ్డి స్పందించారు. అన్ని అంశాలను తెలంగాణ సెంటిమెంట్‌కు జోడించడం మంచిది కాదని హితవు పలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తే తప్పులేదు కానీ చట్టప్రకారం విచారణకు పిలిస్తే తప్పా అని ప్రశ్నించారు. కవితకు వచ్చిన నోటీసులతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.

చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. ఈడీ, సీబీఐలు నరేంద్ర మోడీ స్థాపించిన సంస్థలు కావన్నారు. గతంలో యూపీఏ హయాంలో టూజీ స్పెక్ట్రం కేసులో దర్యాప్తు సంస్థలు కాంగ్రెస్ మిత్ర పక్షం నేతలను అరెస్ట్ చేయలేదా అని ప్రశ్నించారు. మహిళా బిల్లు మరో బిల్లు పేరుతో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు భయపడేది లేదని బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మెరుగైన పాలన నరేంద్ర మోడీ అందిస్తున్నారన్నారు. దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీ అయితే కుటుంబం కోసం పని చేసే పార్టీ బీఆర్ఎస్ అని అందువల్ల బీఆర్ఎస్ నుంచి ఎలాంటి గుణాత్మక మార్పులు మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. మీ గుణాలు మాకు అక్కర్లేదన్నారు. బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు గమనించాలని అన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed