- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ED Investigation: నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్
ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) కేసులో భాగంగా నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఇవాళ ఉదయం 10.30కి విచారణకు హాజరుకానున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) కేసులో భాగంగా నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఇవాళ ఉదయం 10.30కి విచారణకు హాజరుకానున్నారు. అయితే, ఇప్పటికే ఈడీ (ED) నుంచి నోటీసులు అందుకున్న ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. తాను రాలేనని చెప్పడంతో మళ్లీ 16న విచారణకు హాజరు కావాలని అధికారులు కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) నిర్వహణలో నిధుల దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఏసీబీ (ACB) అధికారుల ఇన్వేస్టిగేషన్ కొనసాగుతుండగానే.. మనీ లాండరింగ్ (Money Laundering), ఫెమా (FEMA) నిబంధనలు ఉల్లంఘించారంటూ ఈడీ (Enforcement Directorate) ఆయనపై కేసు నమోదు చేసింది.
కేసు దర్యాప్తులో భాగంగా ఇదే కేసులో నిందితులుగా ఉన్న అప్పటి మునిసిపల్, పట్టణాభివృద్ధి స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్ (Arvind Kumar), హెచ్ఎండీ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి (BLN Reddy)లను ఇప్పటికే ఈడీ (ED) అధికారులు విచారించి వారి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. ఈ క్రమంలోనే ఏసీబీ (ACB) తనపై నమోదైన కేసును కొట్టవేయాలంటూ కేటీఆర్ (KTR) హైకోర్టు (High Court)లో క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేయగా.. ధర్మాసనం డిస్మిస్ చేసింది. హైకోర్టు (High Court) తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు (Supreme Court)లో వేసిన పిటిషన్ వేయగా.. బుధవారం డిస్మిస్డ్ యూజ్ విత్‌డ్రాన్ (Dismissed Use Withdrawn)గా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారుల విచారణలో ఏం జరుగుతుందోనని అటు రాజకీయ వర్గాల్లో.. ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ టెన్షన్ నెలకొంది.






