అమ్మాయిలను మించిపోయేది ఎవడ్రా.. దశాబ్దాలుగా ఇదే చరిత్ర రిపీట్

by Bhoopathi Nagaiah |

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి.

అమ్మాయిలను మించిపోయేది ఎవడ్రా.. దశాబ్దాలుగా ఇదే చరిత్ర రిపీట్
X

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. నాంప‌ల్లిలోని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఇంటర్ బోర్డు అధికారులతో క‌లిసి విడుద‌ల చేశారు. ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్‌లో అమ్మాయిలు స‌త్తా చాటారు. ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాల్లో 66.89 శాతం ఉత్తీర్ణత నమోదవ్వగా, సెకండ్ ఇయర్‌లో 71.37 శాతం సాధించారు. ఫస్టియర్‌లో బాలిక‌లు 73.83 శాతం, బాలురు 57.83 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ సారి ఈ ఫలితాల్లో ఏ జిల్లా ఫస్ట్ వచ్చింది..? ఏ జిల్లా చివరి స్థానంలో ఉంది..? రిజల్ట్‌ను ఎలా తెలుసుకోవాలో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

కర్రిగుట్టలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. కర్రె గుట్టల్లో బాంబులు అమర్చామని, ప్రజలు వేట కోసం అటువైపు వచ్చి ప్రాణాలు కోల్పోవద్దని హెచ్చరిస్తూ ఇటీవల మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. దీంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్ హిడ్మా, ఆయన దళం కర్రిగుట్టల్లో సంచరిస్తున్నట్లుగా కేంద్ర సాయుధ బలగాలకు సమాచారం అందింది. దీంతో పోలీస్ బలగాలు కర్రెగుట్ట పరిసర ప్రాంతాల్లో నిన్న అర్ధరాత్రి నుంచే కూంబింగ్ ముమ్మరం చేశాయి. దీంతో ములుగు జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ లింక్‌లో చూడండి.

ఏపీ లిక్కర్​ స్కాంలో సాక్షిగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్​ చేశారు. ‘లిక్కర్ ​స్కాంలో నా పాత్ర విజిల్ ​బ్లోయర్​. తప్పించుకునేందుకు దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరును లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ ​దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తా’ అంటూ ట్వీట్ ​చేయడం ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది. దొరకని దొంగలు అంటూ ఉటంకించడం వైసీపీ పెద్దలను కలవరపెడుతోంది. ఇంతకు వాళ్లు ఎవరు..? విజయసాయి రెడ్డి ఎవరిని ఇరికించబోతున్నారో ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకే తెలుస్తోంది.

ఏపీలో కేసుల్లో వరుస అరెస్టులు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. వీరంతా మాజీ సీఎంకు అనుయాయులు కావడ గమనార్హం. గత ప్రభుత్వంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన ఐపీఎస్ లు, బిగ్ ​స్కాంలలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఒకరి వెంట ఒకరు అరెస్టు అయ్యారు. దీంతో వైసీపీ అధినేత జగన్​ ను కూటమి ప్రభుత్వం అష్ట దిగ్బంధం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది..? వైసీపీ శ్రేణుల భయానికి కారణం ఏంటో ఈ లింక్ ఓపెన్ చేసి తెలుసుకోండి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం చోటుచేసుకుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సురానా, సాయిసూర్య డెవలపర్స్ మనీ ల్యాండరింగ్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ కంపెనీలను ఆయన ప్రమోట్ చేసిన సమయంలో తీసుకున్న పారితోషికంపై విచారణ చేయనున్నారు. అసలు మహేష్ బాబు ఎలాంటి ఇన్‌ఫ్లుయెన్స్‌ చేశారు..? రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

Next Story