HCA: హెచ్ సీఏ వివాదంలో కీలక మలుపు.. రంగంలోకి ఈడీ

by Prasad Jukanti |

హెచ్ సీఏ వివాదంలో ఈడీ ఎంట్రీ ఇచ్చింది.

HCA: హెచ్ సీఏ వివాదంలో కీలక మలుపు.. రంగంలోకి ఈడీ
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: హెదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అక్రమాల వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. హెచ్ సీఏ అవకతవకల ఇష్యు లోకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. తాజా పరిణామాలపై వివరాలు ఇవ్వాలని సీఐడీకి ఈడీ లేఖ రాసింది. ఇప్పటికే హెచ్ సీఏకు చెందిన రెండు కేసులు ఈడీ వద్ద ఉన్నాయి. తాజాగా హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు (Jagan Mohan Rao) వ్యవహారంపై ఈడీ విచారణ చేయబోతున్నది. సీఐడీ దర్యాప్తులో హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బీసీసీఐకి చెందిన కోట్ల రూపాయలు గోల్ మాల్ అయ్యాయని, ఫోర్జరీ సంతకాలతో పాటు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ ప్రాథమికంగా గుర్తించింది. టెండర్లు లేకుండా పనులు అప్పగించడం, తక్కువ కోట్ చేసిన వారిని కాదని తమ వారికి టెండర్లు అప్పగించిన వ్యవహారాలను సీఐడీ గుర్తించింది. వీటన్నింటిలో ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేయబోతున్నారు.

Next Story