- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ED: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడి ఆస్తులు ఆటాచ్
పటాన్‌చెరు ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: పటాన్‍చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడికి ఎన్‍ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. గూడెం మధుసూదన్‍రెడ్డికి చెందిన రూ.80 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్టు ఇవాళ ఈడీ ఇవాళ ప్రకటించింది. మధుసూదన్ రెడ్డికి చెందిన సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ కంపెనీ రూ.300 కోట్ల అక్రమాలకు పాల్పడిందని అలాగే ప్రభుత్వానికి మధుసూదన్ రెడ్డి రూ.39.8 కోట్ల రాయల్టీ చెల్లించలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పటాన్‍చెరు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా ఈడీ గతేడాది గూడెం మధుసూదన్ రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు నిర్వహించి పలు కీలక ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నామని ఆ ఆస్తి పత్రాలు వివిధ వ్యక్తుల పేర్లపై ఉన్నప్పటికీ వాటి అసలు యజమాని గూడెం మధుసూదన్ రెడ్డి అని దర్యాప్తులో గుర్తించామని ఈడీ పేర్కొంది. ఆ పేర్లపై ఉన్న వారందరూ మధుసూదన్ రెడ్డి బినామీలు అని ఈడీ తెలిపింది. సంతోశ్ సాండ్ అండ్ గ్రానైట్ సప్లైయ్‍కు ప్రభుత్వం మైనింగ్ అనుమతి ఇస్తే దానిని మధుసూదన్ రెడ్డి మరో భాగస్వామ్య సంస్థకు సబ్ కాంట్రక్ట్ ఇచ్చారని ఇది లీజు నిబంధనలకు వ్యతిరేకం అని ఈడీ పేర్కొంది. ఈ క్రమంలో మధుసూదన్ కు చెందిన రూ.80 కోట్ల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. చేసినట్టు ఈడీ స్పష్టం చేసింది. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని పేర్కొంది.






