TG: మహోన్నత లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు.. తెలంగాణ మహిళలు హర్షం

by Gantepaka Srikanth |

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం అతివలకు ఆర్థిక వనరుగా మారుతుంది. ఈ పథకంతో మహిళలకు ఆర్థిక ప్రగతి ఏర్పడుతోంది.

TG: మహోన్నత లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు.. తెలంగాణ మహిళలు హర్షం
X

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం అతివలకు ఆర్థిక వనరుగా మారుతుంది. ఈ పథకంతో మహిళలకు ఆర్థిక ప్రగతి ఏర్పడుతోంది. మహిళామణుల స్వయం ఉపాధికి ప్రభుత్వం అండగా నిలబడుతూ, స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇస్తోంది. ఈ క్రమంలో జిల్లాకు పలు రకాల రుణాల రూపంలో సుమారు రూ.700కోట్లు మంజూరు చేసింది. ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం కింద రూ.105 కోట్ల రుణాలు మంజూరు చేసింది. దీంతోపాటు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.533కోట్లు రుణాలు, శ్రీనిధి కింద రూ.59కోట్ల రుణాలు మంజూరు చేయగా, జిల్లా అధికారులు కంకణబద్ధంగా పనిచేసి 100శాతం లక్ష్యన్ని పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ రుణాలు పొందిన పలువురు మహిళలు పలు యూనిట్లు స్థాపించి విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు. మహిళలకు ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటుపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం అతివలకు ఆర్థిక వనరుగా మారుతుంది. ఈ పథకంతో మహిళలకు ఆర్థిక ప్రగతి ఏర్పడుతోంది. మహిళామణుల స్వయం ఉపాధికి ప్రభుత్వం అండగా నిలబడుతూ, స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇస్తోంది. ఈ క్రమంలో జిల్లాకు పలు రకాల రుణాల రూపంలో సుమారు రూ.700కోట్లు మంజూరు చేసింది. తీసుకున్న రుణాలతో పలువురు మహిళలు పలు యూనిట్లు స్థాపించి విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు. మహిళలకు ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటుపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రుణాలు అందించి.. చేయూత ఇచ్చి..

రాష్ట్రంలోని కోటి మంది మహిళా మణులను కోటీశ్వరులగా తీర్చిదిద్దాలనే మహోన్నత లక్ష్యంతో ఇందిరా మహిళాశక్తి పథకానికి ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపు రూ.లక్ష కోట్లు స్వయం సహాయ సంఘాలకు రుణాలు అందేలా చర్యలు తీసుకుంటుంది. మహిళా సంఘాలతో జిల్లాలోని పట్టణాలు, ప్రజా సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో లాంఛనంగా మూడు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం, ఇల్లంతకుంట, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రూ.3లక్షల బ్యాంక్ రుణం అందజేసి, ఆయా చోట్ల ఏర్పాటు చేసిన క్యాంటీన్లను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్, మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ప్రారంభించి పథకానికి జిల్లాలో శ్రీకారం చుట్టారు.

విభిన్నమైన యూనిట్లు స్థాపించి..

ఇందిరా మహిళాశక్తి కింద జిల్లాలోని ఆయా మండలాల్లో వివిధ యూనిట్లు ఏర్పాటు చేశారు. విభిన్నమైన వ్యాపార యూనిట్లు స్థాపించి ముందుకు సాగుతున్నారు. డెయిరీ యూనిట్, కోల్డ్ ప్రెస్సింగ్ ఆయిల్ మిల్, మదర్ యూనిట్ (పెరటి కోళ్ల పెంపకం) కుట్టు మిషన్ కేంద్రం, బేకరీ, గిఫ్ట్ ఆర్టికల్స్, ఈవెంట్ మేనేజ్ మెంట్, మొబైల్ టిఫిన్ సెంటర్, చట్నీస్ అండ్ స్నాక్స్, మిల్లెట్స్ పౌడర్, రిటైల్ ఫిష్ ఔట్లెట్లు ఏర్పాటు చేసి తమ వ్యాపారాలు చేస్తున్నారు. ఒక్కొకరికి వారి వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని రూ.లక్ష నుంచి రూ.10లక్షల వరకు రుణాలు ఇవ్వగా, మహిళలు యూనిట్లు ఏర్పాటు చేసుకుని దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకుని కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. దానికి ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం కింద రూ.105కోట్ల రుణాలు మంజూరు చేసింది. దీంతోపాటు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.533కోట్లు రుణాలు, శ్రీనిధి కింద రూ.59కోట్ల రుణాలు మంజూరు చేయగా, జిల్లా అధికారులు కంకణబద్ధంగా పనిచేసి 100శాతం లక్ష్యన్ని పూర్తి చేశారు.

రూ.105కోట్ల వడ్డీ లేని రుణాల యూనిట్లు..

రూ.100.91కోట్లతో వివిధ ఎంటర్ ప్రైజెస్‌లు మొత్తం 5,123యూనిట్లు, రూ.1.57 కోట్లతో 185 పాడి గేదెల యూనిట్లు, రూ.93 లక్షలతో 621పెరటి కోళ్ల పెంపకం యూనిట్లు, రూ.31లక్షలతో 9 మదర్ యూనిట్లు, రూ.10లక్షలతో మొబైల్ ఫిష్ ఔట్ లెట్ యూనిట్లు, రూ.98లక్షలతో 53ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, రూ.7.50లక్షలతో మూడు మిల్క్ పార్లర్ యూనిట్లు, రూ.8లక్షలతో మూడు క్యాంటీన్ యూనిట్లు, రూ.3లక్షలతో ఈవెంట్ మేనేజ్ మెంట్ యూనిట్లు ఏర్పాటు చేశారు. దీనికి మొత్తం ఇందిరా మహిళా శక్తి కింద రూ.105కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం మంజూరు చేసింది.

మా కుటుంబానికి ఆర్ధిక భరోసా

రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇందిరా మహిళా శక్తి పథకం కింద రూ.2లక్షల రుణాన్ని పొందాను. సంకేపల్లిలో ఆయిల్ మిల్ ఏర్పాటు చేసుకున్నాను. నువ్వులు, పల్లి, ఇతర నూనె పదార్థాలు విక్రయిస్తున్నాను. కరెంటు బిల్, ఇతర ఖర్చులు పోను నెలకు రూ.10వేల వరకు ఆదాయం వస్తుంది. ఈ యూనిట్ ఏర్పాటు చేయడంతో నా కుటుంబానికి ఆర్థికంగా భరోసాగా నిలుస్తున్నాను. నాకు చేయూతనిచ్చిన రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాలకు ధన్యవాదాలు. - పసికంటి రాజమణి, ఆయిల్ మిల్ నిర్వాహకురాలు, సంకేపల్లి

మహిళలందరూ వినియోగించుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. జిల్లాలోని ఆయా గ్రామాల్లో అర్హులైన మహిళలకు ఇందిరా మహిళా శక్తి కింద బ్యాంక్‌ల నుంచి రుణాలు అందేలా చూస్తున్నాం. ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అర్హులైన మహిళలందరూ ఒక ప్రణాళికతో, మార్కెట్ డిమాండ్‌ను అనుసరించి ఈ పథకాన్ని వినియోగించుకొని ఆర్థికంగా బలపడాలి. కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తూ స్వయం సమృద్ధి సాధించాలి. - సందీప్ కుమార్ ఝా, కలెక్టర్, సిరిసిల్ల

మహిళలకు మంచి అవకాశం

మహిళలు ఆర్థికంగా రాణించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. వారు వృద్ధిలోకి వచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం మహిళలు ఆర్థికంగా ఎదగడానికి సువర్ణ అవకాశం. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని చాలా మందికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదగాలి. - ఆదిశ్రీనివాస్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే

Next Story