- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాసర నుంచి భద్రాచలం వరకు ఎకో కారిడార్
బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి వెంట ఎకో కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు అందుకు తగిన విధంగా ఎకో టూరిజం కూడా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.

బాసర నుంచి భద్రాచలం వరకు ఎకో కారిడార్
ప్రణాళికలు సిద్ధం చేయండి
అధికారులకు సీఎం ఆదేశాలు
ఐఎఫ్ఎస్ అధికారులకు రేవంత్ అభినందనలు
దిశ, తెలంగాణ బ్యూరో : 2027లో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో, బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి వెంట ఎకో కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు అందుకు తగిన విధంగా ఎకో టూరిజం కూడా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జాయిన్ అయిన నూతన ఐఎఫ్ఎస్ అధికారులను గురువారం అభినందించారు. ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులు తప్పనిసరిగా తెలుగు భాషను నేర్చుకోవాలని, అలా చేస్తే ప్రజలతో మరింత సాన్నిహిత్యం ఏర్పడడంతో పాటు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దేశం 2047 ‘రైజింగ్ ఇండియా’ లక్ష్యంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో, ఆ విజన్‌కు అనుగుణంగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అడవుల పరిరక్షణ, పర్యావరణ సంరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టి, భవిష్యత్ తరాలకు సంపదగా అడవులను కాపాడాల్సిన బాధ్యత అటవీ శాఖపై ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అటవీ దళాల ముఖ్య సంరక్షిణాధికారిణి డాక్టర్ సీ సువర్ణ, పీసీసీఎఫ్ రత్నాకర్ జౌహారీ వీరి వెంట ఉన్నారు..






