Panchayithi Elections : పంచాయితీ ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు

by Muthe.Rajitha |

తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం.

Panchayithi Elections : పంచాయితీ ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. ఎన్నికలకు సంబంధించి నేడు మూడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఫ్రీ సింబల్స్, రిటర్నింగ్​ అధికారులు, పోలింగ్​సిబ్బందికి శిక్షణ, పోలింగ్ కేంద్రాల ఫైనల్ వంటి కీలక పనులకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

ఫ్రీ సింబల్స్ ప్రకటన..

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఫ్రీ సింబల్స్​ను ప్రకటిస్తూ.. జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ, ప్రాంతీయ పార్టీల సింబల్స్​తో పాటుగా మరో 30 ఫ్రీ సింబల్స్​ను కేటాయించింది. ఈ ఇండిపెండెంట్​గా పోటీ చేసే వారు ఈ గుర్తుల్లో వేటినైనా ఎంపిక చేసుకోవచ్చు. వారికి ఈ గుర్తులనుకేటాయిస్తారు. ఒకే గుర్తును ఇద్దరు ఎంపిక చేసుకుంటే డ్రా విధానంలో ఎంపిక చేసి వారికి కేటాయిస్తారు. నాలుగు జాతీయ పార్టీలు ఉన్నాయి. వాటిలో కాంగ్రెస్​కు చేయి గుర్తు, బీజేపీకి కమలం పువ్వు, ఆమ్​ ఆద్మీ కి చీపురు, సీపీఎంకు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు, గుర్తింపు పొందిన కేటగిరిలో ఎంఐఎంకు పతంగి, బీఆర్ఎస్​కు కారు, టీడీపీకి సైకిల్, వైఎస్ఆర్​సీపీకి ఫ్యాన్​గుర్తులు కేటాయించారు. రిజిష్ట్రర్డ్​పార్టీల గుర్తుల్లో జనసేకు గాజు గ్లాసు, సీపీఐకి కంకి కొడవలి, ఆల్​ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్​పార్టీ కి సింహం గుర్తులు ఉన్నాయి. రాష్ట్రంలో రిజిష్ట్రర్డ్​పార్టీలుగా నమోదు అయి సింబల్​కేటాయించని పార్టీలు 66 ఉన్నాయి.

ఫ్రీ సింబల్స్​ఇవే...

*ఎయిర్ కండిషనర్, ఆపిల్, పండ్ల బుట్ట, బెల్ట్, బైనాక్యులర్స్, కెమెరా, క్యారమ్​బోర్డు, చపాతీ రోలర్, కోటు, ఫుట్ బాల్ ఆటగాడు ఇలా మొత్తం 30 సింబల్స్​ను ఫ్రీ సింబల్స్​గా ఎన్నికల సంఘం ప్రకటించింది.

15 వరకు ఆర్వోలకు శిక్షణ

ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిటర్నింగ్​అధికారులు, పోలింగ్​సిబ్బందిని ఈనెల 10వ తేదీ కల్లా ఖరారు చేయాలని ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వీరికి శిక్షణ ఇచ్చేందుకు టీవోటీ(ట్రైనర్స్​ఆఫ్​ట్రైనీస్​)ల, మాస్టర్​ట్రైనీస్​లకు శిక్షణ పూర్తి చేసింది. వీరిలో జిల్లాల్లో రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇస్తారు. ఆ తరువాత అసిస్టెంట్​రిటర్నింగ్​అధికారులకు శిక్షణ ఇస్తారు. ఈనెల 12వ తేదీల్లో రిటర్నింగ్​అధికారులకు, ఈనెల 15 కల్లా పీవోలు, ఏపీవోలకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.

15 వరకు పోలింగ్​ కేంద్రాలు ఫైనల్​

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల సంఘం పోలింగ్​ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఈనెల 15కల్లా పోలింగ్​ కేంద్రాల తుది జాబితాను ప్రకటించాలని జిల్లా కలెక్టర్ లను ఆదేశించింది. ఈ మేరకు పోలింగ్​ కేంద్రాల ఖరారుకు షెడ్యూల్​ను శుక్రవారం విడుదల చేసింది. పోలింగ్​ప్రతిపాదిక పోలింగ్​ కేంద్రాల జాబితాను స్వయంగా మండల స్థాయి అధికారులు పరిశీలించి ఆ భవనాలు ఎన్నికల నిర్వహణకు అనువుగా ఉంటాయో లేదో పరిశీలించాలని సూచించింది. ఈ తరువాత ముసాయిదా జాబితాను ప్రకటించాలని సూచించింది.

Next Story