Eatela: జేబీఎస్ వద్ద కూల్చివేతలపై ఈటల కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |

కంటోన్మెంట్ కూల్చివేత్తలను ఈటల రాజేందర్ పరిశీలించారు.

Eatela: జేబీఎస్ వద్ద  కూల్చివేతలపై ఈటల కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ జేపీఎస్ బస్డాండ్ వద్ద కూల్చివేసిన షాపుల స్థానంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి పేదలకు ఇస్తామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) అన్నారు. తాను కంటోన్మెంట్ అధికారులతో మాట్లాడానని కేంద్రం ఎవరి ఉపాధిని దూరం చేయదన్నారు. కంటోన్మెంట్ భూముల్లో (Cantonment, Demolitionists) అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని జేబీఎస్ బంస్టాండ్, ఎరుకల బస్తీలో కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఇవాళ తెల్లవారుజాము నుంచి భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జేబీఎస్ వద్ద కూల్చివేతలను పరిశీలించిన ఈటల రాజేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ భూమి కంటోన్మెంట్ కు చెందిందన్నారు. ఇక్కడ 35 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని అందువల్ల ఇక్కడ షాప్ లు కోల్పోయిన వారికి తిరిగి ఇక్కడే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఉపాధి మార్గం చూపిస్తామన్నారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తున్నారన్నారు.

Next Story