- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Eatala Rajender: ఫ్యూచర్ లో యుద్ధాల కంటే రోడ్డు ప్రమాద మరణాలే ఎక్కువ: ఈటల
ఫ్యూచర్ లో యుద్ధాల కంటే రోడ్డు ప్రమాద మరణాలే ఎక్కువ ఉండబోతున్నాయని ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వం సరైన అధ్యయం చేసి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) సూచించారు. సోమవారం నాచారం (Nacharam) ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ అవగాహన (Traffic Awareness Programme) కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల.. రోడ్డు ప్రమాదాల ద్వారా వచ్చే అనర్థాలు పేద, ధనిక అనే తేడా లేకుండా బాధిత కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తాయన్నారు. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ మరణాలు, రోడ్డు ప్రమాద మరణాలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. భవిష్యత్తులో యుద్ధాలతో కంటే రోడ్డు ప్రమాదంలోనే ఎన్నో రేట్లు ఎక్కువ మరణాలు జరగబోతున్నాయనే లెక్కలు చెబుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వైపు రోడ్డు భద్రత విషయంలో ప్రజలను చైతన్యం చేస్తూనే మరో వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు యుద్ధప్రాతిపదికన చేయాలన్నారు. గడిచిన పదేళ్లలో వేలాది కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగి వాహనాల స్పీడ్ పెరిగిందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా డిపార్ట్మెంట్ పరంగా జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ ప్రమాదాలను ఆపలేమన్నారు.






