Eatala Rajender: సీఎంగా మీరు కొత్తేమో కానీ మీ పార్టీ కొత్త కాదు: ఈటల రాజేందర్

by Prasad Jukanti |

హెచ్ సీయూ భూములపై ఈటల రాజేందర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

Eatala Rajender: సీఎంగా మీరు కొత్తేమో కానీ మీ పార్టీ కొత్త కాదు: ఈటల రాజేందర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ఆర్థిక స్థోమతకు మించి హామీలు ఇచ్చి ఇప్పుడు వాటి అమలు కోసం భూములు అమ్మకానికి పెట్టడం ఏంటని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కొత్త కావొచ్చు కానీ కాంగ్రెస్ (Congress) పార్టీ కొత్త కాదు. అలాంటప్పుడు అనాలోచితంగా హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వ భూములే కాకుండా యూనివర్సిటీ భూములు అమ్మాలనుకునే పిచ్చిప్రయత్నాలు చేయకూడదన్నారు. ప్రభుత్వ భూములు ఏ ప్రభుత్వం అమ్ముకోవాలనే ప్రతిపాదనలు పెట్టినా తాను వ్యతిరేకించానన్నారు. హామీలు ఇచ్చిననాడు వాటిని ఎలా అమలు చేస్తారని అడిగితే కడుపు కట్టుకుని అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు భూములు అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూములను అప్పనంగా అడ్డగోలుగా అమ్ముకోవాలని చూస్తే తాము కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కలిస్తే వారు తక్షణమై స్పందించారన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏంచెప్పిందో తెలుసని చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ లో రూ.70 వేల కోట్లు ఖర్చుపెట్టలేకపోయామని ప్రభుత్వమే చెబుతోంది. 2025-26 సంవత్సరానికి రూ.3 లక్షల 4 వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినా రివైస్డ్ ఎస్టిమేషన్ లో పూర్తిగా ఖర్చు పెట్టలేని నిస్సాహాయతకు రాష్ట్ర ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులమంతా ప్రయత్నం చేస్తున్నామని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

Next Story