Eatala Rajender: హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ ఈటల

by Prasad Jukanti |   (  Updated:2025-01-27 07:44:09  IST  )

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హైకోర్టును ఆశ్రయించారు.

Eatala Rajender: హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ ఈటల
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) హైకోర్టును ఆశ్రయించారు. మేడ్చల్ జిల్లా పోచారం పీఎస్ (Pocharam PS)లో ఇటీవల తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ ఆయన సోమవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్ (Ekasilanagar Incident) లో ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటి స్థలాల యజమానులను స్థిరాస్తి దళారులు ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహంతో ఈటల ఒకరిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనలో ఎంపీ ఈటల తనపై దాడి చేశారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ తాజాగా ఈటల హైకోర్టులో (High Court) పిటిషన్ దాఖలు చేశారు.

Next Story