ఒరిస్సాలో ఈటల రాజేందర్.. కేంద్ర మంత్రి నివాసంలో ఎంపీ

by Ramesh Naini |

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఒరిస్సాలో ఉన్నారు.

ఒరిస్సాలో ఈటల రాజేందర్.. కేంద్ర మంత్రి నివాసంలో ఎంపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) ఒరిస్సాలో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తండ్రి దేబేంద్ర ప్రధాన్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటం వద్ద ఎంపీ ఈటల రాజేందర్ నివాళులు అర్పించారు. భువనేశ్వర్‌లోని వారి నివాసంలో (Union Minister Dharmendra Pradhan) కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను (Anurag Singh Tagore) అనురాగ్ సింగ్ ఠాగూర్‌తో కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కలిసిన వారిలో ఈటల రాజేందర్‌తో పాటు గిరివర్ధన్ రెడ్డి, బద్దం మహిపాల్ రెడ్డి ఉన్నారు.

Next Story