Eatala Rajender: రేవంత్ రెడ్డి దేశాలు తిరిగితే పెట్టుబడులు రావు.. ఈటల రాజేందర్ సెటైర్

by Prasad Jukanti |   (  Updated:2025-04-19 11:45:08  IST  )

రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సెటైర్ వేశారు.

Eatala Rajender:  రేవంత్ రెడ్డి  దేశాలు తిరిగితే పెట్టుబడులు రావు.. ఈటల రాజేందర్ సెటైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పెట్టుబడుల కోసం రేవంత్ రెడ్డి ప్రపంచ దేశాలు తిరుగుతున్నారని కానీ రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) చూసి పెట్టుబడులు రావని ప్రధాని నరేంద్ర మోడీ అందిస్తున్న సురక్షిత పాలన, పటిష్టవంతమైన నాయకత్వం వల్ల వస్తాయనే విషయాన్ని మర్చిపోవద్దని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) అన్నారు. ఇవాళ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈటల కాంగ్రెస్, కేసీఆర్ పై (KCR) విమర్శలు గుప్పించారు. జుగుప్సాకరం అయిన కాంగ్రెస్ ఎజెండా మీద దేశ ప్రజలకు హేయభావం కలిగిందని కనుచూపు మేర మళ్లీ కాంగ్రెస్ పై విశ్వాసం రాదు, ఆ పార్టీ గెలవదన్నారు. 2019 లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగాల్సి ఉన్నా కేసీఆర్ తన ప్రయోజనాల కోసం ఆరు నెలలు ముందుకు వెళ్లారని విమర్శించారు. ప్రజల హితం కోరే పార్టీలు ఇలా చేయవని విమర్శించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇప్పుడే కొత్తగా తీసుకువస్తున్న కార్యక్రమం కాదుని గతంలో 1951, 57, 62, 67 నాలుగు సార్లు దేశంలో రాష్ట్రాలకు దేశానికి ఒకేసారి ఎన్నికలు జరిగాయన్నారు.

ఆపే శక్తి ఎవరికీ:

ఆయారాం గయారాం సంస్కృతి మొదలైందే కాంగ్రెస్ హయాంలో అని ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఈటల ధ్వజమెత్తారు. కేరళ, హర్యానా చరిత్ర మన కళ్లముందే ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసింది కాబట్టే నాటు ఇందిరా గాంధీ జైలు పాలయ్యారని. కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ కోసం, రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టడానికి రాజ్యాంగ సవరణలు చేస్తే.. బీజేపీ దేశహితం కోసం రాజ్యాంగ సవరణలు చేసిందన్నారు.10 ఏళ్ల తరువాత కూడా మళ్లీ అధికారంలోకి బీజేపీ వచ్చిందని అప్పట్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో ఇతర పార్టీలకు ఓటు వేసేవారు కానీ ఇప్పుడు మోడీ, బీజేపీ మళ్లీ రావాలని ఓటు వేశారన్నారు. బీజేపీ అజేయమైన శక్తి అని మూడో సారి ప్రధాని అయిన ఘనత నెహ్రూ తరువాత మోడీకే దక్కిందన్నారు. కాంగ్రెస్ నేతలు తన చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నారు. నిజానికి అంబేద్కర్ ను అవమానించిందే కాంగ్రెస్ అన్నారు. నేతల చరిత్ర గుర్తుపెట్టుకునే పనుచేయాలి తప్ప ప్రజలు అసహ్యించుకొనే పని చేయవద్దని అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చింది బీజేపీ అన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ (One Nation One Election) అమలు చేయాలనుకుంటే ఆపే శక్తి ఎవరికీ లేదని మంచి కోసం చేసే పనికి సపోర్ట్ చేయకపోతే ఎలిమినేట్ అవుతారని హెచ్చరించారు. ప్రజలు విజ్ఞులని ఎవరిని గెలిపించాలో వారికి తెలుసన్నారు. బియ్యం, పెన్షన్ ఇస్తున్నారా లేదా అనే కంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్నారా లేదా అనేదే ప్రజలు చూస్తారన్నారు. అహంకారం, దోపిడీకి ఓటు వేయరని అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదేనన్నారు.

మంచికి పనికి సపోర్ట్ చేయకపోతే ఎలిమినేటే:

నేతల చరిత్ర గుర్తుపెట్టుకునే పనుచేయాలి తప్ప ప్రజలు అసహ్యించుకొనే పని చేయవద్దని అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చింది బీజేపీ అన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ చేయాలనుకుంటే ఆపే శక్తి ఎవరికీ లేదుని మంచి కోసం చేసే పనికి సపోర్ట్ చేయకపోతే ఎలిమినేట్ అవుతారని హెచ్చరించారు. ప్రజలు విజ్ఞులని ఎవరిని గెలిపించాలో వారికి తెలుసన్నారు. బియ్యం, పెన్షన్ ఇస్తునారా లేదా అనే కంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్నారా లేరా అని ప్రజలు చూస్తారున్నారు. అహంకారం, దోపిడీకి ఓటు వేయరని అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదేనన్నారు.

Next Story