- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Eatala Rajender: దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కాంగ్రెస్ తీరు!
అంబేద్కర్ ను అవమానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన గురించి మాట్లాడం విడ్డూరంగా ఉందని ఈటల రాజేందర్ విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ తీరు దొంగే దొంగ అని అన్నట్లుగా ఉందని రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన పార్టీ, ప్రజల హక్కులను కాలరాసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని బయలుదేరిందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎన్నో ఆకృత్యాలను ఎదుర్కొన్నారని ఇందిరా గాంధీ దేశంలో విధించి ఎమర్జెన్సీ విధించి పౌరుల హక్కులను కాలరాశారని మండిపడ్డారు. ఇవాళ ఖమ్మంలో ఎమర్జెన్సీ (Emergency Rule) చీకటి పాలనకు వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో ఎవరిని చంపుతారో, ఎవరిని జైల్లో పెడతారా తెలియని పరిస్థితులు లేవని అన్నారు. ఈ దేశాన్ని 50 ఏళ్లకు పైగా పరిపాలించిన కాగ్రెస్ పార్టీ ఎందుకు రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకుని అమలు చేయలేకపోయారో సమాధానం చెప్పే దమ్ము ధైర్యం తెలంగాణలో ప్రభుత్వాన్ని వెలగబెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు.
దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా కాంగ్రెస్ తీరు:
అంబేద్కర్ మేధస్సును చూసి ఓర్వలేక కేంద్ర మంత్రివర్గం నుంచి వెళ్లిపోయేలా చేసింది కాంగ్రెస్ పార్టీ అని, ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన్ను ఓడించింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. అంబేద్కర్ ను అవమానించి ఎన్నికల్లో ఓడించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా అంబేద్కర్ (Ambendkar) గురించి మాట్లాడటం ఎంత దుర్మార్గమో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. పేదవాళ్లు మరింత పేదేవారిగా, ధనికులు మరింత ధనికులుగా మారుతున్నారని 75 ఏళ్ల స్వతంత్ర్యం తర్వాత కూడా సమాజాంలోని అంతరాలు రూపుమాపకపోవడం వల్ల రిజర్వేషన్లు, ఏ,బీ,సీ,ల వర్గీకరణల గురించి మాట్లాడుతున్నామన్నారు. ఈ పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అవునా కాదా అని నిలదీశారు. తెలుగు రాష్ట్రాన్ని 40 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే ఏ ఒక్క సారి కూడా ట్రైబల్, ఓబీసీ ముఖ్యమంత్రి కాలేదన్నారు. ఎస్సీ నేత దామోదరం సంజీవయ్య కొంత కాలం మాత్రమే సీఎంగా పని చేశారన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ బీసీ ఎజెండానే మా ఎజెండా అని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలకు ఆచరణకు పొంతన లేదన్నారు.
ఆరు గ్యారెంటీలు.. 420 హామీలు ఎటుపోయాయి?:
ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉందని ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజలను వంచిస్తోందన్నారు. ఆరు గ్యారెంటీలు (Six Guarantees), 420 హామీలు ఎటుపోయాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అనాదిగా రెండు నాల్కల ధోరణితోనే వ్యవరిస్తోందన్నారు. పదవి, పార్టీ కంటే బీజేపీకి దేశమే ముఖ్యం అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ప్రజాస్వామ్యం ఉన్నట్లు ఓడిపోతే ప్రజాస్వామ్యం ఖూనీ అనియినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇది కాంగ్రెస్ పార్టీ ద్వద్వ వైఖరి అన్నారు. తెలంగాణ తన పూర్వ వైభవాన్ని పొందాలటే అందుకు బీజేపీ పార్టీనే సరైనదన్నారు.






