- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Etela Rajender: వాళ్లకి చేత కాదని తెలుసు.. కాళేశ్వరం సీబీఐకి అప్పగించడంపై ఈటల ఫస్ట్ రియాక్షన్
కాళేశ్వరం ప్రాజెక్టుపై 665 పేజీల ఘోష్ కమిషన్ నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టుపై 665 పేజీల ఘోష్ కమిషన్ నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష నేతల వాడీవేడీ చర్చల అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) విచారణను సీబీఐ (CBI)కి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై బీఆర్ఎస్ (BRS) నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణను సీబీఐకి అప్పగించడంపై బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) రియాక్ట్ అయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మంచి పని చేశారు. వాళ్లకి చేత కాదని తెలుసు. వాళ్ల రిపోర్టు తప్పుల తడక అని తెలుసు.. వాళ్ల రిపోర్టు నిలవదు అనేది వాళ్లకు అర్థమైంది కాబట్టి డిస్ ఓన్ చేసుకోవడానికి ఈ పని చేశారు’ అని అన్నారు. ఏది ఏమైనప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ సంపూర్ణంగా ఎంక్వయిరీ చేస్తుందని నమ్మకముందని తెలిపారు. కాళేశ్వరంపై జరిగిన అక్రమాలను బయటపెడుతుందని సంపూర్ణ విశ్వాసం మాకు ఉందని క్లారిటీ ఇచ్చారు.






