- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Eatala Rajendar: కుల సంఘాలు రాజకీయ పార్టీలకు ఊడిగం చేయొద్దు: ఈటల
ఎంపీగా గెలవడం కంటే వార్డు మెంబర్ గా గెలవడం కష్టం అని ఈటల రాజేందర్ అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కుల సంఘాలు కుల సంఘంలా ఉండాలి తప్ప రాజకీయ పార్టీలకు ఊడిగం చేయవద్దని, అలా చేస్తే మన హక్కులను ఖతం పట్టించినట్లేనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatela Rajender) అన్నారు. కులం ఎంత ఐక్యంగా ఉంటే రాజకీయ నాయకులకు అంత బలం ఉంటుందన్నారు. ఇవాళ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ మరియు ఉప సర్పెంచ్‍లకు సన్మానం, 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈటల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సంఘాలు చచ్చిపోతే చైతన్యం చచ్చిపోతుందని చైతన్యం చచ్చిపోతే అణగారిన జాతులకు అండ లేకుండా పోతుందన్నారు. అణిచివేతకు గురవుతున్న వారికి, సంఖ్య ఉండి కూడా విద్య ఉద్యోగం రాజకీయం ఆర్థికపరంగా అవకాశాలు రానివారికి సంఘం కావాల్సిందేనన్నారు. కుల సంఘాల నాయకులకు కుటుంబం బాధ్యతతో పాటు సంఘటితశక్తిగా జాతిని నడిపే రెండు బాధ్యతలు ఉంటాయన్నారు.
ఎంపీ కంటే వార్డు మెంబర్ గెలవడం కష్టం:
ఎంపీ ఎమ్మెల్యే గెలవడం కంటే వార్డు మెంబర్, సర్పంచ్ గెలవడం కష్టం అని మనం ఒకరిని తిట్టాల్సిన అవసరం లేదు మనకేం కావాలో కొట్లాడి తీసుకోవాలన్నారు. ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. రాజకీయాలు డబ్బులు మయం అయ్యాయని మహిళ రిజర్వేషన్ ఉన్న దగ్గర ఆడవాళ్లు పోటీ చేయమంటే ఏడ్చారు. ఈ పైసల ఉచ్చు నుండి బయట పడాలంటే చైతన్యం ఐక్యతప్ప మరో మార్గం లేదున్నారు. దీనిని ధ్వంసం చేయగలిగిన శక్తి యువతకు, సంఘాలకు మాత్రమే ఉంటుందని. మీరు అనుకున్న గోల్ ఎంతో దూరంలో లేదని సందర్భం వస్తుంది కొట్టుడు కొడదామన్నారు. దేశం యువశక్తి చేతుల్లో ఉందని మన ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే చెబుతున్నారు. యువతకు రాజీ పడే అలవాటు ఉండదన్నారు. మన చరిత్ర మనం చెప్పుకోకుండా, రాసుకోకుండా ఉంటే మనం చిన్న వాళ్ళం అయిపోతామన్నారు.






