- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Eatala: ఇది వారి పనే.. కేసీఆర్ ఫోన్ కాల్ ప్రచారంపై ఈటల హాట్ కామెంట్స్
కేసీఆర్ తనకు ఫోన్ చేశారంటూ జరుగుతున్న ప్రచారంపై ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు ఫోన్ చేశారని, మళ్లీ కలిసి పనిద్దామని పిలిచారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) క్లారిటీ ఇచ్చారు. ‘నేనంటే గిట్టని వారు, సైకోలు, శాడిస్టులు చేసే ప్రచారం తప్ప.. ఇందులో ఎలాంటి నిజం లేదు’ అని అన్నారు. బీఆర్ఎస్, కేసీఆర్ విషయంలో చాలా కాలంగా తన స్టాండ్ ఏంటో చెబుతూనే ఉన్నా ఎందుకో ఇలా దుష్ప్రచారం చేస్తున్నారన్నారని వాపోయారు. ఇదంతా బాధ్యత లేని వ్యక్తులు సోషల్ మీడియాలో శాడిజంతో చేసే ప్రచారమని మండిపడ్డారు. ఎన్ని రోజులు ఈ పిచ్చి పనులు చేస్తారు ? ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈటల ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మళ్లీ కేసీఆర్ (KCR) పిలిస్తే వెళ్తారా..? అని అడిగిన ప్రశ్నకు ‘ఇదేమన్నా పిల్లలాటనా? బాధ్యత కలిగిన పొలిటికల్ లీడర్లం.. వాళ్ల పార్టీ వాళ్లది.. మా పార్టీ మాది.. రేపు నేను ఈ బీఆర్ఎస్ పార్టీనే ఓడించి తెలంగాణ గడ్డపై బీజేపీ గెలిపించడమే నా కర్తవ్యం..’ అని అన్నారు.
ప్రభుత్వానికి నిజాయితీ, చిత్తశుద్ధి, ప్రణాళిక లేదు
గతంలో బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఒక్కరోజులో జరిపిన సమగ్ర కుటుంబ సర్వేలో సమగ్ర సమాచారం లేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయించిన కులగణనకు (Caste Census) ఎలాంటి శాస్త్రీయత లేదని ఎంపీ ఈటల ఆరోపించారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాకే బీసీ-ఈ గ్రూప్ తెచ్చారని, ఆ తర్వాతనే ముస్లింలు బీసీలుగా గుర్తించబడ్డారనేది తప్పు అని అన్నారు. అంతకుముందే కొన్ని ముస్లిం కులాలు బీసీ-బీ గ్రూప్‌లో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజాయితీ, చిత్తశుద్ధి, ప్రణాళిక లేదని విమర్శించారు. ఒక కమిషన్ వేసి దానికి చట్టబద్ధత కల్పించి ఇప్పుడున్న కులాలు ఏవి? వాటి ప్రకారం జనగణన చేయాలన్నారు. అవేవి లేకుండా కులగణన అంటే అవగాహన లేనివారు డైవర్ట్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చదువుకునే రోజుల్లో అనేక మంది విద్యార్థి సంఘాల్లో పని చేస్తుంటారని, తామంతా సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో చదుకున్నామని, విద్యార్థి సమస్యలపై కొట్లాడేందుకు ఆయా సంఘాలతో పని చేశానని చెప్పారు.






