బల్లి మంచిగా ఫ్రై అయ్యింది తిను.. ఫ్యామిలీ రెస్టారెంట్ ఓనర్ వెకిలి కామెంట్స్

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-05-15 14:55:14  IST  )

ఓ వ్యక్తికి బాగా ఆకలిగా ఉందని ఓ రెస్టారెంట్ కెళ్లి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసి తింటుండగా అందులో బల్లి ప్రత్యక్షమైంది.

బల్లి మంచిగా ఫ్రై అయ్యింది తిను.. ఫ్యామిలీ రెస్టారెంట్ ఓనర్ వెకిలి కామెంట్స్
X

ఓ వ్యక్తికి బాగా ఆకలిగా ఉందని ఓ రెస్టారెంట్ కెళ్లి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసి తింటుండగా అందులో బల్లి ప్రత్యక్షమైంది. ఈ ఘటన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కేంద్రంలో నేడు జరిగింది. సాగర్ రోడ్డులో ఉన్న ఓ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి బిర్యానీ తింటుండగా బల్లి కనిపించడంతో షాక్‌కు గురైయ్యారు. వెంటనే రెస్టారెంట్ నిర్వాహకులను నిలదీయగా.. మంచిగా ఫ్రై అయింది తిను అని కామెడీగా మాట్లాడారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

కర్రెగుట్టల్లో వారంరోజుల కిందట జరిగిన ఎన్‌కౌంటర్‌లో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ఏటూరు గ్రామానికి చెందిన సాధనపల్లి చందు అలియాస్ రవి(24) మ‌ృతిచెందాడు. భద్రాచలంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తూ మావోయిస్టు పార్టీ ఉద్యమంలోకి వెళ్లాడు. మావోయిస్టు పార్టీలో బెటాలియన్ డాక్టర్ టీం కమాండర్‌గా దామోదర్ రైట్‌హ్యాండ్‌గా చందు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. అతడిపై రూ. 8 లక్షల రివార్డు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

అమెరికాలో మన ఇళ్లు, భూమి వద్దకే అధికారులు వచ్చి రిజిస్ట్రేషన్​చేసి వెళతారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. భూముల రీసర్వే, భూ రికార్డుల డిజిటలైజేషన్​పై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గుంటూరులోని ఐటీసీ హోటల్​లో ఇవాళ వర్క్​షాప్​ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి పెమ్మసాని మాట్లాడుతూ వందేళ్ల తర్వాత ఏపీలో జరుగుతున్న భూముల రీసర్వే జాగ్రత్తగా చేయాలని​సూచించారు. అమెరికాలో తాను ఇల్లు కొన్నాక 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్​కావడంతో ఆశ్చర్యపోయానని పెమ్మసాని పేర్కొన్నారు. ఈ విధానానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ లింక్ ఓపెన్ చేసి తెలుసుకోండి.

టూరిజం సెక్టార్‌లో హోటళ్లు, రూముల కొరత ఉందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పెద్దఎత్తున హొటల్ రూమ్‌లు వస్తే పర్యాటకానికి ఊపు వస్తుందన్నారు. 50 వేల రూమ్‌లు అందుబాటులోకి తేవాలనేది మన ముందున్న లక్ష్యమని తెలిపారు. హోటల్ రూమ్‌ల ధరలు అందుబాటులో ఉంటే పర్యాటకులు ఆయా ప్రాంతాల్లో బస చేస్తారని పేర్కొన్నారు. కారవాన్స్‌ పాలసీని కూడా సిద్దం చేసి అమల్లోకి తేవడం ద్వారా పర్యాటకులకు కొత్త అనుభూతి కలుగుతుందన్నారు. దేవాలయాలకు వచ్చే వారికి మంచి వసతిచాలా ముఖ్యమన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

Next Story