Breaking News : కొత్త రేషన్ కార్డులకు బ్రేక్ వార్తలపై ఈసీ క్లారిటీ

by Muthe.Rajitha |   (  Updated:2025-02-08 13:20:54  IST  )

తెలంగాణ(Telangana)లో కొత్త రేషన్ కార్డు(New Ration Cards)లకు బ్రేక్ అంటూ వస్తున్న వార్తలపై ఎన్నికల కమిషన్(Election Commission) క్లారిటీ ఇచ్చింది.

Breaking News : కొత్త రేషన్ కార్డులకు బ్రేక్ వార్తలపై ఈసీ క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో కొత్త రేషన్ కార్డు(New Ration Cards)లకు బ్రేక్ అంటూ వస్తున్న వార్తలపై ఎన్నికల కమిషన్(Election Commission) క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తలు నిజం కాదని తేల్చి చెప్పింది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను, తప్పుల సవరణను నిలివేస్తున్నామంటూ తాము ఆదేశాలు జారీ చేస్తున్నట్టు కొన్ని న్యూస్ చానల్స్ ప్రచారం చేస్తున్నాయని.. తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని ఈసీ క్లారిటీ ఇచ్చింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలు వార్తా సంస్థలు కథనాలు ప్రసారం చేయగా.. దీనిపై వివరణ ఇస్తూ ఈసీ ప్రకటన జారీ చేసింది.

కాగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఏడాదిగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. దీంతో ప్రభుత్వం శుక్రవారం గుడ్ న్యూస్ తెలిపింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గత నెల 26న గ్రామ సభల్లో దరఖాస్తు చేయని వారు కూడా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని అటు పౌరసరఫరాల శాఖ సైతం ప్రకటించింది. ప్రస్తుతం రేషన్ కార్డులు కలిగి కుటుంబ సభ్యుల పేర్లలో మార్పులు, చేర్పులు, చిరునామా వంటి వాటికి వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మీసేవా కేంద్రాల్లో కొత్త ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల స్వీకరణను వెంటనే ప్రారంభిచాలని మరోవైపు ప్రభుత్వం కూడా ఆదేశించింది. దీంతో రేషన్ కార్డులు లేని పేదలు మీ కేంద్రాలకు వెళ్లారు. అయితే వారికి అక్కడ నిరాశ మిగిలింది. దరఖాస్తులు స్వీకరించడంలేదు. మీ సేవా సెంటర్లలో కొత్త రేషన్ కార్డుల పోర్టల్ ఓపెన్ కాలేదు. ఎందుకనే విషయం మీ సేవా కేంద్రాల నిర్వాహకులకు సైతం సమాచారం లేదు.

Next Story