తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూకంపం.. హడలెత్తిన ప్రజలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-05 14:07:25  IST  )

తెలంగాణ(Telangana)లోని పలు ప్రాంతాల ప్రజలు హడలెత్తారు. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా పలుచోట్ల భూమి కంపించింది(Earthquake).

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూకంపం.. హడలెత్తిన ప్రజలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana)లోని పలు ప్రాంతాల ప్రజలు హడలెత్తారు. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా పలుచోట్ల భూమి కంపించింది(Earthquake). కరీంనగర్‌లోని సుల్తానాబాద్, వేములవాడ, సిరిసిల్లతో పాటు నిర్మల్(Nirmal) జిల్లాలోని ఖానాపూర్‌, కడెం, మంచిర్యాల జిల్లాలోని జన్నారంలో స్వల్పంగా కంపించింది. అనూహ్య పరిణామంతో హడలెత్తిన ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపంపై స్పందించిన అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. సురక్షిత ప్రాంతాల్లో ఉండటం బెటర్ అని ఆదేశాలు జారీ చేశారు.

కాగా, ఇటీవలే రామగుండం పారిశ్రామిక ప్రాంతం(Ramagundam Industrial Area)లో భూమి కంపించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. తమ పరిశోధనల ఆధారంగా తెలంగాణలో రామగుండంతో పాటు పలు సమీప ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించే ప్రమాదం ఉందని, ఆ ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. భూకంపాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.

అసిఫాబాద్‌ జిల్లాలోని రెబ్బెన మండలం గోలేటి గ్రామ పరిసర ప్రాంతాలను జాతీయ భూకంప కేంద్రంగా ఎన్‌సీఎస్ నిర్ధారించింది. తాజాగా పది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. సరిగ్గా సోమవారం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు భూకంపం వచ్చింది.




Next Story