Earthquake: తెలంగాణలో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.0గా నమోదు

by Kema Shiva Kumar |   (  Updated:2024-12-07 09:03:26  IST  )

తెలంగాణ (Telangana)లో ఇవాళ మరోసారి భూకంపం సంభవించింది.

Earthquake: తెలంగాణలో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.0గా నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో ఇవాళ మరోసారి భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం 12.15 నిమిషాలకు మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల పరిధిలోని దాసరిపల్లి కేంద్రంగా పలుచోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. భూమి లోపల సుమారు 10 కి.మీ లోతున భూకంపం వచ్చినట్లుగా నేషనల్ ఫర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు. అయితే, ఈ హఠాత్పరిణామంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదైంది. కాగా, సరిగ్గా మూడు రోజు క్రితం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో భూకంపం సంభవించింది. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం సంభవించగా.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రగా 5.3గా నమోదైంది. దాదాపు 20 ఏళ్ల తరువాత తెలంగాణలో హఠాత్తుగా భూకంపం సంభవించడం ఆందోళన కలిగించింది. మొదట ములుగు జిల్లాలో మేడారం, మారేడుపాక, బోర్లగూడెం మధ్య ఉన్న ప్రాంతంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.

భూమి లోపల 40 కి.మీ లోతున భూకంపం వచ్చినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు తెలిపారు. చర్ల, దుమ్ముగూడెం ప్రాంతంలో ప్రకంపనలు అధికంగా కనిపించాయి. ఇళ్లు కదిలిపోతున్నట్లు అనిపించడంతో జనం బయటకు పరుగులు తీశారు. కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపించడం, ఇళ్లలోని వస్తువులు పడిపోవడంతో ప్రజలు షాక్‌కు గురయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad), ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి, హనుమకొండ, మంచిర్యాల, పెద్దపల్లి, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాలో సుమారు 7 సెకన్ల పాటు, హైదరాబాద్ మహా నగరంలో 2 సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. గోదావరి రివర్ బెడ్‌లో ఎక్కువగా ప్రకంపనలు సంభవించాయి.

Next Story