- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెబ్ ఆప్షన్ల నమోదు... విద్యార్థులకు బిగ్ అలర్ట్.. !
జేఎన్టీయూ అధికారుల వైఫల్యం విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతున్నది. మొన్న సర్టిఫికేట్ల వెరిఫికేషన్లలో

ఈఏపీ సెట్ వెబ్ ఆప్షన్ల నమోదు ఆలస్యం
- జేఎన్టీయూ అధికారుల వైఫల్యం
- విద్యార్థులు, తల్లిదండ్రులకు కష్టాలు
- మొన్న సర్టిఫికేట్ వెరిపికేషన్‌లో, నేడు వెబ్ ఆప్షన్ నమోదులో..
దిశ, తెలంగాణ బ్యూరో: జేఎన్టీయూ అధికారుల వైఫల్యం విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతున్నది. మొన్న సర్టిఫికేట్ల వెరిఫికేషన్లలో ఇబ్బందులు రాగా.. తాజాగా వెబ్ ఆప్షన్ల నమోదులోనూ అదే పరిస్థితి ఎదురైంది. దాంతో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నమోదుకు విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈఏపీసెట్ వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియకు మళ్లీ బ్రేక్ పడింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా.. సాయంత్రం 4 గంటలకు మార్చారు. అయితే.. అప్పుడు కూడా వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వకుండా మరోసారి నమోదు ప్రక్రియను మారుస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
సాయంత్రం 6 గంటల నుంచి ప్రక్రియను ప్రారంభించుకోవచ్చని చెప్పారు. మరోవైపు.. వెబ్ ఆప్షన్ల ఈ నెల 6 నుంచి 10 వరకు చాన్స్ ఇచ్చారు. 14, 15 తేదీల్లో తొలి విడత మాక్ సీట్లను కేటాయించనున్నారు. 18లోపు మొదటి సీట్ల కేటాయింపు పూర్తిచేస్తారు. 25 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ చేపడుతారు. 26 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 26, 27 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. అలాగే.. 30వ తేదీలోపు రెండు విడత సీట్ల కేటాయింపు పూర్తిచేయనున్నారు. ఈ నెల 31 నుంచి వచ్చేనెల 2లోపు విద్యార్థులు రిపోర్టింగ్ చేసేందుకు అవకాశం ఇచ్చారు. వచ్చే నెల 5 నుంచి మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 5న స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించి.. 6న తుది విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తిచేయనున్నారు. అనంతరం 6,7 తేదీల్లో తుది విడత వెబ్ ఆప్షన్లకు చాన్స్ ఇచ్చారు. 10లోపు తుది విడత సీట్లు కేటాయించనున్నారు.






