- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోయిన్ పల్లిలో ఈగిల్ టీమ్ దాడి
హైదరాబాద్ బోయిన్ పల్లిలో ఎక్సైజ్ ఈగిల్ టీమ్ శనివారం మధ్యాహ్నం శ్రీమేధా స్కూల్ పై మెరుపు దాడులు నిర్వహించింది.

బోయిన్ పల్లిలో ఈగల్ టీమ్ దాడి
-పెద్ద మొత్తంలో అల్ఫాజోలం స్వాధీనం
-హైదరాబాద్ కల్తీ కల్లు మూలాలు పాలమూరు జిల్లాలో వెలుగులోకి
దిశ, మహబూబ్ నగర్ : హైదరాబాద్ బోయిన్ పల్లిలో ఎక్సైజ్ ఈగల్ టీమ్ శనివారం మధ్యాహ్నం శ్రీమేధా స్కూల్ పై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడిలో సుమారు కోటి వరకు విలువ చేసే అల్ఫాజోలం మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శ్రీ మేథా స్కూల్ డైరెక్టర్ జయ ప్రకాశ్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జయప్రకాశ్ గౌడ్ తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అయితే జయప్రకాశ్ గౌడ్ హైదరాబాద్ బోయిన్ పల్లితో పాటు మహబూబ్ నగర్, జడ్చర్ల ప్రాంతాలకు పెద్ద మెుత్తంలో అల్పాజోలం సరఫరా చేస్తున్నట్లుగా ఈగిల్ టీమ్ గుర్తించింది. ఎవరికీ అనుమానం కలగకుండా ఓ స్కూల్ ని స్థాపించి అందులోనే సదరు వ్యక్తి అల్ఫాజోలంను నిల్వ చేసి అక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లా వాసి కావడంతో జిల్లాలో చాలా మంది కల్లు అమ్మకందారులతో అంటకాగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ పరిచయాలతోనే పెద్దమెుత్తంలో మహబూబ్ నగర్ జిల్లాకు అల్ఫాజోలం సరఫరా చేసినట్లు సమాచారం. హైదరాబాద్ లో కల్తీ కల్లు మూలలు మహబూబ్ నగర్ జిల్లాలో వెలుగు చూస్తుండటంతో ఈగల్ టీం అధికారులు అంతర్గత విచారణను సాగిస్తున్నారు.






