- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MPLADS: మరింత పారదర్శకంగా ఎంపీ నిధుల వ్యయంపై ఈ-సాక్షి పోర్టల్ (E-Sakshi Portal)
పార్లమెంట్ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం అందచేస్తున్న నియోజక అభివృద్ధి నిధుల కేటాయింపు, పథకాల అమలు, వ్యయం (స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులు ) తదితర వివరాలను సామాన్య ప్రజలు తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ-సాక్షి అనే పోర్టల్ ప్రవేశపెట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో: (MPLADS) పార్లమెంట్ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం అందచేస్తున్న నియోజక అభివృద్ధి నిధుల కేటాయింపు, పథకాల అమలు, వ్యయం (స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులు ) తదితర వివరాలను సామాన్య ప్రజలు తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ-సాక్షి (E-Sakshi Portal) అనే పోర్టల్ ప్రవేశపెట్టింది. ఎంపీలకు అందచేస్తున్న సీడీఎఫ్ నిధుల వినియోగంపై మరింత పారదర్శకత ఉండేందుకుగాను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-సాక్షి నిర్వహణ తీరుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో (Members of Parliament Local Area Development Scheme) ఎంపీ లాడ్స్ పై జోనల్ శిక్షణా కార్యక్రమం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగింది. కేంద్ర ప్రభుత్వ గణాంక, ప్రణాళిక అమలు మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ వర్క్ షాప్‌లో, దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో పాటు, తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్య ప్రణాళిక అధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ లాడ్స్ పథకానికి సంబంధించిన ఈ- సాక్షి పోర్టల్ అన్ని వివరాలను, అధికారులకు ప్రత్యేక్ష శిక్షణ కల్పించారు. ఎంపీ లాడ్స్ కింద మంజూరు చేసిన పనులు, వాటి పురోగతి, నిధుల వ్యయం తదితర అంశాలను పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ((PFMS)) ద్వారా మ్యాపింగ్ చేయడం, తద్వారా సంబంధిత అధికారులు డిజిటల్ ప్రక్రియలను మరింత మెరుగ్గా అవగాహన చేసుకోవడంతో పాటు, సందేహాలను వెంటనే పరిష్కరించే అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రణాళిక శాఖ డైరెక్టర్ రూఫస్ దత్తం తెలిపారు. ఈ వర్క్ షాప్ కు గణాంకాలు, ప్రణాళిక అమలు మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ పూజాసింగ్ మండోల్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జోసెఫ్ లు హాజరై తగు శిక్షణను అందచేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక అమలు మంత్రిత్వశాఖ అధికారులు మరియు రాష్ట్ర ప్రణాళిక శాఖ అధికారులు పాల్గొన్నారు.






