- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HMDA: హెచ్ఎండీఏ ప్లాట్ల ఈ- వేలం.. తుర్కయంజాల్ ప్రీ-బిడ్ సమావేశానికి విశేష స్పందన
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో తుర్కయంజాల్‌లోని 12 ప్లాట్ల ఈ-ఆక్షన్ కి సంబంధించిన ఫ్రీబిడ్ సమావేశానికి భారీగా స్పందన వచ్చిందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (Hyderabad Metropolitan Development Authority) ఆధ్వర్యంలో (Turkayamjal) తుర్కయంజాల్‌లోని 12 ప్లాట్ల (E-auction) ఈ-ఆక్షన్ కి సంబంధించిన ఫ్రీబిడ్ సమావేశానికి భారీగా స్పందన వచ్చిందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఈనెల 17న నిర్వహించబోయే ఈ వేలం ప్రీ-బిడ్ సమావేశాన్ని తుర్కయంజాల్ లేఅవుట్ లోనే మంగళవారం ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు హెచ్ఎండీఏ నిర్వహించింది. ఈ సమావేశంలో హెచ్ఎండీఏ ఎస్టేట్ మేనేజ్మెంట్ యూనిట్‌కు చెందిన డెప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్ రెడ్డి వేల ప్రక్రియను విశదంగా వివరించారు.
ఎంఎస్టీసీ ప్రతినిధులు ఈ-ఆక్షన్ విధానం గురించి ప్రజెంటేషన్ ఇవ్వగా, కేపీఎంజీ సంస్థ ప్రతినిధులు తుర్కయంజాల్ వ్యూహాత్మక ప్రాముఖ్యత, భవిష్యత్ అభివృద్ధి అవకాశాలను వివరించారు. సమావేశంలో పాల్గొన్న వారి అన్ని ప్రశ్నలకు హెచ్ఎండీఏ, ఎంఎస్టీసీ అధికారులు సమగ్రంగా సమాధానాలు ఇచ్చారు. హెచ్ఎండీఏ తరఫున సమావేశం సజావుగా జరిగేందుకు ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ ధన్‌మోహన్ సింగ్, అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సత్యనారాయణ, పీఆర్ఓ కె. శ్రీకాంత్ రెడ్డి, ప్లానింగ్, ఇంజనీరింగ్ డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు.






