- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
College Holidays: ఇంటర్ విద్యార్థులకు దసరా సెలవులు.. కాలేజీల రీ ఓపెన్ ఎప్పుడంటే?
రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కళాశాలలకు దసరా సెలవుల షెడ్యూల్‌ను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఖరారు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని (Intermediate colleges) ఇంటర్మీడియట్ కళాశాలలకు (Dussehra holidays) దసరా సెలవుల షెడ్యూల్‌ను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) ఖరారు చేసింది. అన్ని రకాల జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు అమలులో ఉంటాయని బోర్డు ఒక పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ పది రోజుల సెలవు కాలం ఇంటర్ మొదటి సంవత్సరం (ఫస్ట్ టర్మ్) పరిధిలోకి వస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, రెసిడెన్షియల్ (టీజీ సోషల్, ట్రైబల్, బీసీ, మైనార్టీ) కేజీబీవీ, టీజీ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలు సహా రాష్ట్రంలోని అన్ని ఇంటర్మీడియట్ విద్యా సంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయి. సెలవుల అనంతరం, విద్యార్థులు అక్టోబర్ 6 న తిరిగి కళాశాలలకు హాజరు కావాలని బోర్డు తెలియజేసింది.
సెలవుల్లో క్లాసులు వద్దు..
ఈ దసరా సెలవుల సమయంలో రాష్ట్రంలోని ఏ ఒక్క జూనియర్ కళాశాలలోనూ తరగతులు నిర్వహించకూడదని బోర్డు ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలకు కఠినంగా ఆదేశించింది. ఈ సూచనలను ఉల్లంఘించి తరగతులు నిర్వహించినట్లు తేలితే, సంబంధిత కళాశాల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్‌పై సీరియస్‌గా చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. నిబంధనలు పాటించని కళాశాలల అనుబంధాన్ని రద్దు చేసేందుకు కూడా వెనుకాడబోమని బోర్డు కార్యదర్శి ప్రకటనలో స్పష్టం చేశారు.






