- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: విద్యార్థులకు విద్యాశాఖ గుడ్‌న్యూస్.. దసరా సెలవులు ప్రకటన
తెలంగాణలోని విద్యార్థులకు ప్రభుత్వం(Telangana Govt) గుడ్‌న్యూస్ చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని విద్యార్థులకు ప్రభుత్వం(Telangana Govt) గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ(Department of Education) దసరా సెలవులను(Dussehra Holidays) ప్రకటించింది. ఈ మేరకు సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బతుకమ్మ మొదలు దసరా పండుగ వరకు హాలీడేస్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు 13 రోజుల పాటు దసరా సెలవులు ఇచ్చింది. విద్యాశాఖ క్యాలెండర్ ప్రకారం.. ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు హాలీడేస్ ఉండనున్నాయి. దీంతో పాటు అక్టోబర్ 4న తిరిగి స్కూళ్లను తెరవనున్నారు. అయితే 5వ తేదీ ఆదివారం కావడంతో ఆరో తేదీన స్కూళ్లను తెరిచే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈసారి ఈ సెలవుల్లో అక్టోబర్ 2న గాంధీ జయంతి కాగా అదే రోజు దసరా వచ్చింది. అంతేకాదు.. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు జూనియర్ కాలేజీలకు సెలవులు ఇచ్చారు.






