- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మునుగోడు ప్రజలకు దుబ్బాక ప్రజల కీలక సందేశం
by GSrikanth |
మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నాటి నుండి నియోజకవర్గంలో రాత్రికి రాత్రే పోస్టర్లు వెలసి కలకలం సృష్టిస్తున్నాయి.

X
దిశ, చౌటుప్పల్: మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నాటి నుండి నియోజకవర్గంలో రాత్రికి రాత్రే పోస్టర్లు వెలసి కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా శనివారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో మరోసారి పోస్టర్లు వెలిశాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన పోస్టర్లలో మునుగోడు ప్రజలారా మేం మోసపోయాం మీరు మోసపోకండి అంటూ దుబ్బాక ప్రజలు పేరున పోస్టర్లను అంటించారు. శుక్రవారం రాత్రి ఈ పోస్టర్‌లను అంటిచ్చినట్లు తెలుస్తుంది. నియోజకవర్గంలో వరుసగా రాత్రికి రాత్రి పోస్టర్లు ఎవరు వేస్తున్నారన్నది తేలాల్సి ఉంది. ఉదయం మున్సిపల్ సిబ్బంది చౌటుప్పల్‌లో వెలసిన పోస్టర్లను తొలగిస్తున్నారు.
Next Story






