- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దుబ్బాక ఎమ్మెల్యే మరోసారి హాట్ కామెంట్స్

దిశ, వెబ్ డెస్క్ : దుబ్బాక ( Dubbaka) గులాబీ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar reddy) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి.. మరో బాంబు పేల్చారు. రేవంత్ రెడ్డి ( Revanth reddy) ప్రభుత్వం ఐదేళ్లపాటు ఉండాలని... ఒక్క రోజులోనే మాట మార్చారు కొత్త ప్రభాకర్ రెడ్డి. సోమవారం రోజున.. గులాబీ పార్టీ కార్యకర్తల సమావేశంలో కొత్త ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణలోని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు... కాంగ్రెస్ ప్రభుత్వం పై అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కాంగ్రెస్ సర్కారును కూల్చివేయాలని... వ్యాపారస్తులే కోరుతున్నట్లు కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ( Congress) నుంచి గట్టి కౌంటర్ వస్తోంది. కింది స్థాయి కాంగ్రెస్ లీడర్ నుంచి మంత్రుల వరకు... ప్రతి ఒక్కరు కొత్త ప్రభాకర్ రెడ్డి కి కౌంటర్ ఇస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే నిన్న చేసిన వ్యాఖ్యలపై... క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉండాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిపాలించాలని కేసీఆర్ కోరుకుంటున్నట్లు.. చెప్పుకొచ్చారు కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రభుత్వాన్ని కూలగొట్టాలని మేము ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదని... ఇక చేయబోమని స్పష్టం చేశారు. గజ్వేల్ మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ భూ దందాలు జరిగిన తెలంగాణ ప్రభుత్వం బయటికి తీయాలని డిమాండ్ చేశారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.