DSC 2008 Victims : ప్రజా భవన్ ముందు డీఎస్సీ 2008 బాధితుల ఆందోళన

by Y. Venkata Narasimha Reddy |

అపాయింట్మెంట్ ఆర్డర్స్(Appointment Orders) ఇవ్వాలంటూ 2008డీఎస్సీ బాధితులు(DSC 2008 Victims) ప్రజా భవన్(Praja Bhavan) ముందు ఆందోళన(Dharna)కు దిగారు.

DSC 2008 Victims : ప్రజా భవన్ ముందు డీఎస్సీ 2008 బాధితుల ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: అపాయింట్మెంట్ ఆర్డర్స్(Appointment Orders) ఇవ్వాలంటూ 2008డీఎస్సీ బాధితులు(DSC 2008 Victims) ప్రజా భవన్(Praja Bhavan) ముందు ఆందోళన(Dharna)కు దిగారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన డీఎస్సీ 2008 బాధితులు ప్రజాభవన్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని ఏడాది గడిచిపోయిన తమకు ఇంతవరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిందని, దాదాపు 5 నెలలుగా అపాయింట్మెంట్ ఆర్డర్ల కోసం ఎదురు చూస్తున్నామన్న అభ్యర్థులు తెలిపారు.

తమకు నియామక పత్రాలు అందించేలా షెడ్యూల్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1399 మంది అభ్యర్థులు ఉన్నట్లుగా ప్రభుత్వం నిర్ధారించిందని తమకు ఉద్యోగ నియామక పత్రాలు జారీ చేసి ఇన్నాళ్ల తమ నిరీక్షణ, వేదనకు తెరదించి తమ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. సీఎం రేవంత్‌ రెడ్డి జోక్యం చేసుకొని తమ సమస్యకు పరిష్కారం చూపించాలని నినాదాలు చేశారు. కౌన్సిలింట్‌ షెడ్యూల్‌ ప్రకటించి పోస్టింగ్ లు ఇవ్వాలని కోరారు.

Next Story