ఎల్‌నినో ఎఫెక్ట్.. ఖరీఫ్ రైతులకు వ్యవసాయశాఖ హెచ్చరిక

by Naga Rani Yarlagadda |

ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతులను వ్యవసాయశాఖ అప్రమత్తం చేస్తోంది.

ఎల్‌నినో ఎఫెక్ట్.. ఖరీఫ్ రైతులకు వ్యవసాయశాఖ హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతులను వ్యవసాయశాఖ అప్రమత్తం చేస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో సంప్రదాయ పంటల కంటే పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడమే ఉత్తమని సూచిస్తోంది. ఇప్పటికే రైతులు ఎలాంటి పంటల సాగు చేయాలనే అంశంపై యాక్షన్ప్లాన్సిద్ధం చేసింది. గతవారం రోజుల నుంచి మండల, గ్రామాలకు చెందిన వ్యవసాయ అధికారుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని రైతులకు మేలు చేసే పంటలు సాగు చేసేలా ప్రచారం చేయనుంది. ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో గ్రామాలకు వెళ్లి రైతులు తక్కువ కాలంలో చేతికొచ్చే పంటల సాగుతో పాటు నీటి లభ్యత ప్రకారం సాగు చేయాలనే అంశాలను వివరించనున్నారు. జూన్లో వర్షాలు ప్రారంభమవుతాయని భావించి తొందరపడి వరి సాగులోకి వెళ్లడం ప్రమాదకరమని, నీటి లభ్యతపై పూర్తి భరోసా ఉన్నప్పడు మాత్రమే వరి వంటి నీటి ఆధారిత పంటలను సాగు చేయాలని సూచిస్తున్నారు.

మధ్యంతర కరువు

జూన్నెలలో సాధారణ వర్షపాత నమోదయ్యే అవకాశాలు ఉన్నప్పటికి రైతులు దాని ఆధారంగా అధిక నీటి అవసరమయ్యే పంటల వైపు మొగ్గు చూపకూడదని వ్యవసాయశాఖ హెచ్చిరించింది. జూలై, ఆగస్టు నెలల్లో మధ్యంతర కరువు పరిస్ధితులు ఏర్పడే అవకాశం ఉందని ఈసమయంలో సాగునీటి నిర్వహణ అత్యంత కీలకమతుందని తెలిపింది. ఆగస్టు, సెప్టెంబర్లో కూడా నీటి సరఫరా కొనసాగుతుందనే నమక్మం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే వరి సాగు చేయాలని, లేకుంటే ఇతర పంటలు ఎంచుకోవడం మంచిదని వ్యవసాయ రంగ నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఈ ఖరీస్సీజన్ప్రభుత్వం 131 లక్షల ఎకరాలో వివిధ పంటలు సాగు అవుతాయని అంచనావేసి అందులో వరి 65 లక్షలు సాగు అవుతుందని గుర్తించింది. ఎల్‌నినో కారణంగా వరిసాగు 35 లక్షల ఎకరాలు దాటకుండా ప్రయత్నాలు చేస్తోంది.

అధిక ఆదాయం

రైతులు కూరగాయలు, పండ్లు, నువ్వలు, పొద్దు తిరుగుడు, కుసుమలు, శనగలు పంటలు వేస్తే అధిక ఆదాయం వస్తోందని ఉద్యాన శాఖ పేర్కొంటుంది. ఈఏడాది నుంచి మార్కెట్సౌకర్యాలు మెరుగుపరుస్తుండగా పంటను చేనులో నుంచి నేరుగా మార్కెట్ కు తీసుకొచ్చి అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తోంది. రైతులు కూరగాయలు, పండ్లు మార్కెట్కు తీసుకొచ్చినప్పుడే ధరలు పడిపోతాయి. అదే దళారులు కొనుగోలు చేసిన సరుకులు రెండింతలు ధరలు పెరుగుతాయి. ఈసారి అలాంటి పరిస్ధితులు రాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ వానాకాలంలో వ్యవసాయశాఖ వేరుశనగ 26 వేల ఎకరాలు, నువ్వులు 650 ఎకరాలు, పొద్దు తిరుగుడు 150 ఎకరాలు, కుసుమలు 3,600 ఎకరాల్లో సాగు కావచ్చని అంచనా వేస్తోంది. జొన్నలు 39 వేల ఎకరాలు, సజ్జలు 1200 ఎకరాల్లోనే సాగు అయ్యే అవకాశం ఉందని భావిస్తోంది. మొక్కజొన్నలు 5.40 లక్షల ఎకరాలు, కంది పంట 5.10 లక్షల ఎకరాల్లో వేయాలని టార్గెట్ పెట్టుకుంది. మిర్చి 1.90 లక్షల ఎకరాలు, సోయాబీన్4.10 లక్షల ఎకరాలు, పెసర్లు 65 వేల ఎకరాలు, మినుములు 28 ఎకరాలు రైతులు సాగు చేసేలా ప్రయత్నాలు చేస్తోంది.

సన్న వరిసాగు

ఈసారి వానలు తక్కువగా కురిసే పరిస్థితి ఉండటంతో సన్న వరి కంటే దొడ్డు రకాలు వేయాలని రైతులకు వ్యవసాయ శాఖ సూచించనుంది. సన్నాలు వేస్తే అధిక నీటి వినియోగంతో పాటు పంట కాలం ఎక్కువగా ఉంటుంది. దీంతో సమయానికి నీరు లభించకుంటే పంట ఎండిపోవడంతో పాటు పెట్టుబడి రైతులు నష్టపోతారు. దొడ్డు వరి సాగు చేస్తే తక్కువ కాలంలో పంట చేతికి రావడంతో పాటు నీటి సమస్య ఉన్న అధిగమించవచ్చు. ఒక వేళ పంట ఎండిన పెద్దగా నష్టం కూడా ఉండదు. ఎరువుల వినియోగం సన్నాల కంటే తక్కువ ఉంటుంది.

Next Story