- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మందు తాగాను కానీ.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు చుక్కలు చూపించిన డ్రైవర్
కొంతమంది మందుబాబులు పీకలదాకా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి చివరకు పోలీసులకే చుక్కలు చూపిస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే కరీంనగర్ లోని తెంలగాణ చౌక్ వద్ద చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: కొంతమంది మందుబాబులు పీకలదాకా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి చివరకు పోలీసులకే చుక్కలు చూపిస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే కరీంనగర్ లోని తెంలగాణ చౌక్ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా ఓ మందుబాబు ఫుల్లుగా తాగి హల్ చల్ చేశాడు. తాగి పట్టుబడిన తరవాత నన్ను చంపేస్తారా అంటూ పోలీసులనే ప్రశ్నించాడు. నేను తాగాను ఫైన్ కడతా జైలుకు పోతా.. కానీ మీరు మా లాంటి సామాన్యులనే పట్టుకుంటారు అని అన్నాడు. పెద్దోళ్లను పట్టుకోరు అంటూ హల్ చల్ చేశాడు.
పెద్దోళ్లు ఎంతపెద్ద తప్పు చేసినా వాళ్లను ఏం చేయరు అప్పుడు మీది డిపార్ట్మెంట్ ఏ కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేస్తుండగా పోలీసులకు సహకరించకుండా ఇబ్బందిపెట్టాడు. చివరికి పోలీసులు అతడిని ఒప్పించి టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో మందుబాబు చెప్పినట్టుగానే ఫైన్ రాసి జైలుకు పంపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మందు బాబు మాట్లాడింది నిజమే అని కొందరు సమర్దిస్తుంటే.. ఈ మధ్య ఫుల్లుగా తాగి పోలీసులతోనే గొడవకు దిగడం ఫ్యాషన్ అయిపోయింది అంటూ మరికొందరు నెటిజన్లు అంటున్నారు.






