మద్యం మత్తులో ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కిన యువకుడు.. చివరికి!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-20 15:24:24  IST  )

మద్యం మత్తులో కొందరు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాగిన మత్తులో ఏం జరుగుతుందో అర్థం కాక మెదడు పనిచేయక సాహసాలు చేస్తుంటారు.

మద్యం మత్తులో ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కిన యువకుడు.. చివరికి!
X

దిశ‌, వెబ్ డెస్క్: మద్యం మత్తులో కొందరు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాగిన మత్తులో ఏం జరుగుతుందో అర్థం కాక మెదడు పనిచేయక సాహసాలు చేస్తుంటారు. మత్తులో అలా ప్రవర్తిస్తారు కానీ ప్రమాదం జరిగిన తరవాత అర్థం అవుతుంది. తాజాగా అలాంటి ఘటనే చోటు చేసకుంది. మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు.

గ్రామంలోని ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి కరెంట్‌తోనే ఆటలు ఆడాడు. యువకుడి చేష్టలకు అక్కడకు చాలా మంది చేరుకుని వాదిస్తున్నప్పటికీ వినకుండా ట్రాన్స్‌ఫార్మర్ పైకి కరెంట్ తీగలు పట్టుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరికి కరెంట్ తీగలపై కాళ్లు పెట్టి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అందరికి దండం పెట్టి కరెంట్ తీగలపై కాలు వేయడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలింది. కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే ట్రాన్స్ ఫార్మర్‌పై పడిపోయాడు.

Click For Twitter Post..

Next Story