హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

by Naga Rani Yarlagadda |

న్యూ ఇయర్ వేడుకల్లో మాదక ద్రవ్యాల వాడకాన్ని అరికట్టేందుకు పోలీసులు హైదరాబాద్ నగరమంతా..

హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూ ఇయర్ వేడుకల్లో మాదక ద్రవ్యాల వాడకాన్ని అరికట్టేందుకు పోలీసులు హైదరాబాద్ నగరమంతా ముమ్మర తనిఖీలు చేపట్టారు. తాజాగా ఓ స్కూల్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు పెడ్లర్లు, ఐదుగురు వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ఐద్దరు మెడికల్ స్టూడెంట్స్, ముగ్గురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుల వద్ద నుంచి 70 గ్రాముల ఎండీఎంఏ, 2 కార్లు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Next Story