టెలిగ్రామ్ యాప్ ద్వారా డ్రగ్స్ సరఫరా! ఇద్దరిపై కేసు, కారు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్

by Ramesh Naini |

మన్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి సోషల్ మీడియా టెలిగ్రామ్ యాప్ ద్వారా ఓజీ కుష్‌ను తెప్పించి విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు హస్మత్‌ పేట్ డీటీఎఫ్ సీఐ నర్సిరెడ్డి సిబ్బంది కలిసి పరిధిలో తనిఖీలు నిర్వహించారు.

టెలిగ్రామ్ యాప్ ద్వారా డ్రగ్స్ సరఫరా! ఇద్దరిపై కేసు, కారు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ చేపట్టిన దాడుల్లో రూ. 9 లక్షల విలువ చేసే 76.77 గ్రాముల కొకైన్, 200 గ్రాముల ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసులు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి కారు స్వాధీనం చేసుకున్నట్లు మేడ్చల్ ఎక్సైజ్ సూపరింటెండ్ షేక్ ఫయాజ్ ద్దీన్ తెలిపారు. సుచిత్ర సర్కిల్లో రూట్ వాచ్ నిర్వహించి 76.77 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కొకైన్‌తో పాటు ఒక కారును కూడా సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఇన్‌జోత్‌సింగ్ నాగ్‌పాల్ (27) అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ కొకైన్‌ను ముంబాయిలోని బోబ్రిలీ కేప్ వద్ద అబ్‌డుజ్ అనే వ్యక్తి నుంచి తీసుకున్నట్లు విచారణలో నిందితుడు వెల్లడించారు.

టెలిగ్రామ్ ద్వారా ఓజీ కుష్‌ విక్రయం

మరో కేసులో మన్ ప్రీత్ సింగ్ (35) అనే వ్యక్తి సోషల్ మీడియా టెలిగ్రామ్ యాప్ ద్వారా ఓజీ కుష్‌ను తెప్పించి విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు హస్మత్‌ పేట్ డీటీఎఫ్ సీఐ నర్సిరెడ్డి సిబ్బంది కలిసి పరిధిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మన్‌ప్రీత్ సింగ్ వద్ద 260 గ్రాముల ఓజీ కుష్ (హైబ్రిడ్ గంజాయి)ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కోన్నారు. ఓజీ కుష్‌ను తమిళనాడులోని పాట్యాల అనే వ్యక్తి సరఫరా చేసినట్లు నిందితుడు వెల్లడించారు. రెండు కేసుల్లో కొకైన్ నిందితుడని కుత్భుల్లాపూర్, ఓజీ కేసులోని నిందితుడిని బాలనగర్ ఎక్సైజ్ స్టేషన్లలో అప్పగించినట్లు వెల్లడించారు.

Next Story