డ్రగ్స్ మాఫియా కన్నింగ్ స్కెచ్

by Muthe.Rajitha |

డ్రగ్స్ దందాపై రాష్ట్ర పోలీసులు పంజా విసురుతుండడంతో డ్రగ్స్ మాఫియా దందాను సాగించేందుకు మరో కన్నింగ్ ఐడియాతో ట్రై చేస్తోంది.

డ్రగ్స్ మాఫియా కన్నింగ్ స్కెచ్
X

దిశ, సిటీక్రైం : డ్రగ్స్ దందాపై రాష్ట్ర పోలీసులు పంజా విసురుతుండడంతో డ్రగ్స్ మాఫియా దందాను సాగించేందుకు మరో కన్నింగ్ ఐడియాతో ట్రై చేస్తోం ది. ఈగల్, టాస్క్‌ఫోర్స్, ఎస్‌వోటీ, హెచ్ న్యూ వివిధ పోలీసు వింగ్స్ నిరంతరం డ్రగ్స్ ముఠాలపై విరుచుకుపడుతుండడంతో డ్రగ్స్ మాఫియా దందాను పోలీసుల డేగ కన్ను కనిపెట్టకుండా ఉండేందుకు డెడ్ డ్రాప్‌లో కొత్త రూటును రూపొందించారు.

డెడ్ డ్రాప్‌లో కొత్త రూటు ఇలా..

డెడ్ డ్రాప్‌ విధానంలో డ్రగ్స్ ము ఠాలోని సరఫరాదారులు పట్టు బడుతుండడంతో కొత్త రూటును ఎంచుకున్నారు. నైజీరియాలో ఉండే ప్రధా న డ్రగ్స్ సరఫరాదారు వర్చువల్ నం బరుతో హైదరాబాద్‌తో పాటు దేశం లో ఉన్న తమ నెట్‌వర్క్‌తో టచ్‌లో ఉంటాడు. వర్చువల్ నంబర్ ద్వారా నైజీరియాలో ఉండి హైదరాబాద్ వి నియోగదారుడి నుంచి ఆర్డర్ తీసుకుంటాడు. ఆ తర్వాత నగరంలో ఉం డే ముఠా సభ్యుడికి డెలివరీకి ఆదేశిస్తాడు. అతను డెడ్ డ్రాప్‌లో ఓ చోట డ్రగ్స్ పెట్టి, ఆ ఫొటో, లొకేషన్‌ను నై జీరియాలో ఉన్న ప్రధాన సూత్రధారుడికి పంపిస్తాడు. నైజీరియాలో ఉన్న కింగ్ పిన్ వర్చువల్ నంబర్ ద్వారా సభ్యుడు షేర్ చేసిన లొకేషన్, ఫొటో ను వినియోగదారుడికి నైజీరియా నుంచి పంపిస్తాడు.

వచ్చిన లొకేషన్‌ కు వెళ్లి డ్రగ్స్ తీసుకుని అనుమానం రాకుండా వినియోగదారుడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఒక వేళ దొరికి నా అతని వాట్సాప్‌కు వచ్చిన లొకేష న్, ఫొటో నైజీరియా నుంచి షేర్ అ య్యి ఉండడం, వర్చువల్ నంబర్‌ను ఉపయోగించడంతో అసలు సూత్రధా రి దొరకడు. అదే విధంగా నగరంలో ని లొకేషన్‌లో డ్రగ్స్ పెట్టిన వ్యక్తి స మాచారం చిక్కదు. ఈ విధంగా డ్ర గ్స్ ముఠాలు ప్లాన్ చేసి కొన్ని రోజులుగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాయని హైదరాబాద్ హెచ్ న్యూ పోలీసుల దర్యాప్తులో తేలింది. దీనికి టెక్నాలజీ పరంగా చెక్ పెట్టేందుకు పోలీసులు ఈ రూటుపై నిఘా పెట్టేందుకు అప్‌డేట్ అయ్యారు.

Next Story