- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYDRA : హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాలు.. భారీగా తరలివచ్చిన నిరుద్యోగ యువత
హైదరాబాద్‌లోని హైడ్రా(Hyderabad Disaster Response and Assets Monitoring Agency) సంస్థలో ప్రకటించిన డ్రైవర్ ఉద్యోగాల(Driver Jobs) కోసం దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో తరలి వచ్చారు.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని హైడ్రా(Hyderabad Disaster Response and Assets Monitoring Agency) సంస్థలో ప్రకటించిన డ్రైవర్ ఉద్యోగాల(Driver Jobs) కోసం దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఈ ఉద్యోగాలు HYDRA ఆధ్వర్యంలోని వివిధ విభాగాలలో 200 ఖాళీలను భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పోస్టులన్నీ విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పర్యవేక్షణ వంటి విభాగాలకు చెందిన వాహనాలు నడపడానికి సంబంధించినవిగా సమాచారం. ఈ ఉద్యోగాలకు డ్రైవింగ్ లైసెన్స్, సంబంధిత డ్రైవింగ్ అనుభవంతోపాటు 2022-2023 లో స్వల్ప మార్కులతో కానిస్టేబుల్ ఉద్యోగాలకు దూరమైన అభ్యర్థులు మాత్రమే అర్హులుగా హైడ్రా పేర్కొంది.
అందులో భాగంగా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(TSLPRB) ఇచ్చిన నివేదికలో పేర్లు ఉన్నవారి దరఖాస్తులు మాత్రమే సిబ్బంది స్వీకరించారు. కాగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వేల సంఖ్యలో నిరుద్యోగులు హైదరాబాద్ లోని హైడ్రా కార్యాలయానికి క్యూ కట్టడం గమనార్హం.






