- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాసేపట్లో రామోజీ ఫిల్మ్‌సిటీకి ద్రౌపది ముర్ము.. భద్రత మరింత కట్టుదిట్టం
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) శీతాకాల విడిది పర్యటనలో భాగంగా ఇవాళ ఆమె తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఆధ్వర్యంలో జరుగుతున్న చైర్‌పర్సన్ల ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ జాతీయ వార్షిక సదస్సును ప్రారంభిస్తారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) శీతాకాల విడిది పర్యటనలో భాగంగా ఇవాళ ఆమె తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఆధ్వర్యంలో జరుగుతున్న ఛైర్‌పర్సన్ల ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ జాతీయ వార్షిక సదస్సును ప్రారంభిస్తారు. ఈ రెండు రోజుల సదస్సులో దేశవ్యాప్తంగా యూనియన్ మరియు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్‌పర్సన్ల పాల్గొంటారు. పరీక్షల సంస్కరణలు, చట్టపరమైన సవాళ్లు వంటి అంశాలపై చర్చలు జరుగనున్నాయి.
అనంతరం సరిగ్గా ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి మీదుగా ద్రౌపదీ ముర్ము రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City)కి చేరుకుని సాయంత్రం 4.30 గంటల వరకు అక్కడే గడపుతారు. అయితే, రాష్ట్రపతి పర్యటన సందర్భంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జాతీయ రహదారి వెంట పోలీసులను మోహరించారు. రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ వద్ద అబ్దుల్లాపూర్‌మెట్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలను విధించారు.






