- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలమూరుపై డ్రామాలు బంద్ చేయాలి: ఎంపీ డీకే అరుణ ధ్వజం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS)పై రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని, ఇప్పటికైనా డ్రామాలు బంద్ చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దిశ, వెబ్‌డెస్క్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS)పై రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని, ఇప్పటికైనా డ్రామాలు బంద్ చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే (DK Aruna) అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆమె ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ.. దశాబ్ద కాలంగా ప్రాజెక్టును పెండింగ్‌లో పెట్టిన కేసీఆర్ (KCR) ఇప్పుడు ప్రాజెక్టుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాజెక్టును పూర్తి చేయాలనే చిత్తశుద్ధి ఇటు కాంగ్రెస్‌కు, అటు బీఆర్ఎస్‌కు లేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)ది పాలమూరు జిల్లానే అయినప్పటికీ, రెండేళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు పనుల్లో పురోగతి శూన్యమని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రజెంటేషన్లు ఇవ్వడం కాదు.. క్షేత్రస్థాయిలో నీళ్లు ఇచ్చి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.
సరైన రీతిలో కేంద్రానికి డీపీఆర్ పంపాలి..
అదేవిధంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)ను కేంద్ర ప్రభుత్వం (Government Of India) వెనక్కి పంపడంపై వస్తున్న ఆరోపణలను ఆమె తిప్పికొట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన డీపీఆర్ తప్పుల తడకగా ఉందని, అందుకే కేంద్రం దానిని సరిచేసి పంపాలని సూచించిందని ఆమె స్పష్టం చేశారు. సరైన రీతిలో నివేదికలు సమర్పిస్తే కేంద్రం నుంచి నిధులు రాబట్టే బాధ్యత తాము తీసుకుంటామని, కానీ రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపకుండా కేంద్రాన్ని బూచిగా చూపిస్తోందని డీకే ఆరుణ ఫైర్ అయ్యారు.






